జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు తరచూ రాశులు, నక్షత్రాల గుండా సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచరిస్తున్న సమయంలో ఆయా రాశులు, నక్షత్రాలపై అనుకూల ప్రతికూల, ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో గ్రహాల సంచారం జ్యోతిష్య పరంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ద్రిక్ పంచాంగం ప్రకారం ప్రస్తుతం గురుడు (బృహస్పతి) మిథున రాశిలో, శని మీన రాశిలో సంచరిస్తుండగా, రాహువు బుధుడు, శుక్రులతో కలిసి కుంభ రాశిలో ఉన్నాడు. ఫిబ్రవరి 28 నాటికి కుజుడు, చంద్రుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ విధంగా ఒకే రాశిలో అనేక గ్రహాలు కూడి ఉండటాన్ని “గ్రహాల అమరిక”గా భావిస్తారు.