Youngest Captain : టీమిండియాలో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశి రికార్డుల గురించే ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చ జరిగింది. అయితే, క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మరొక యువ కెప్టెన్ జాక్ వుకుసిక్ గురించి తెలుసుకుందాం. ఈ యువ క్రికెటర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశిలాగే జాక్ వుకుసిక్ కూడా ఒక ప్రపంచ రికార్డును ఎలా నెలకొల్పాడు? అతను ఎన్ని సంవత్సరాల వయసులో కెప్టెన్సీ చేశాడు? ఆ వివరాలు ఈ వార్తలో చూద్దాం.
టీనేజ్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడం అనేది ఇప్పుడు సర్వసాధారణం. అయితే, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం అనేది చాలా అరుదు. ఇప్పుడు జోక్ వుకుసిక్ అనే 17 ఏళ్ల యువ క్రికెటర్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతి చిన్న వయసులో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
జోక్ వుకుసిక్ అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ చేసిన అతి చిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 17 సంవత్సరాల 311 రోజుల వయసులో క్రొయేషియా తరపున సైప్రస్‌పై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి ఈ రికార్డును సాధించాడు. 2022లో ఫ్రాన్స్ కెప్టెన్ నోమాన్ అమ్జాద్ (18 ఏళ్ల 24 రోజులు) పేరిట ఉన్న రికార్డును జోక్ బద్దలు కొట్టాడు.
కొద్ది రోజుల క్రితం, వైభవ్ సూర్యవంశీ అనే 14 ఏళ్ల యువ క్రికెటర్ టీ20ల్లో అతి చిన్న వయసులో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. అదే విధంగా, జోక్ వుకుసిక్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు, టీ20లలో కూడా కెప్టెన్సీ చేసిన అతి చిన్న వయసు క్రికెటర్‌గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులో సెంచరీ సాధిస్తే, జోక్ వుకుసిక్ చిన్న వయసులో కెప్టెన్‌గా నిలిచి రికార్డు నెలకొల్పాడు.
టీ20 క్రికెట్‌లో అత్యంత చిన్న వయసులో కెప్టెన్సీ చేసిన రికార్డు గతంలో పాకిస్తాన్ ఆటగాడు తైమూర్ అలీ పేరిట ఉండేది. అతను 2009లో 17 ఏళ్ల 358 రోజుల వయసులో క్వెట్టా బియర్స్‌కు కెప్టెన్సీ చేశాడు. 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ రికార్డును జోక్ వుకుసిక్ బద్దలు కొట్టాడు. ఈ యువ క్రికెటర్ భవిష్యత్తులో కూడా ఇలాంటి అద్భుతాలు సృష్టిస్తాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..