ఇండియా – ఇంగ్లాండ్ చివరి టెస్ట్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ తక్కువ 247 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతోంది. గిల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ తక్కువ పరుగులకే ఔట్ అయినా.. ఓపెన్ యశస్వి జైస్వాల్ మాత్రం అదరగొట్టాడు. నిలకడగా ఆడి సెంచరీతో మెరిశాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 2రన్స్‌కే అవుట్ అయిన సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. ఇవాళ్టి బ్యాటింగ్‌తో విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. నిజానికి జైస్వాల్ లీడ్స్ టెస్ట్‌లో 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీని తర్వాత మళ్లీ సెంచరీ చేయలేడు. ఇప్పుడు, జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో 127 బంతుల్లో ఆరో సెంచరీ పూర్తి చేసుకుని విమర్శకుల ప్రశంసలు పొందాడు.
ఇంగ్లాండ్‌పై 4 సెంచరీలు
ఓవల్ గ్రౌండ్‌లో తన టెస్ట్ కెరీర్‌లో ఆరో సెంచరీ సాధించిన జైస్వాల్, ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై ఒక సెంచరీ చేశాడు. లీడ్స్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేసిన జైస్వాల్, ఎడ్జ్‌బాస్టన్, మాంచెస్టర్‌లలో అర్ధ సెంచరీలు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను 87 రన్స్ సాధించగా.. మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేశాడు. దీనితో పాటు జైస్వాల్ రెండుసార్లు డకౌట్ అయ్యాడు.
జైస్వాల్ సచిన్, కోహ్లీలను అధిగమించాడు
జైస్వాల్ 2వేల రన్స్ చేసి సచిన్, కోహ్లీ రికార్డులను బ్రేక్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లోనే 2వేల పరుగులు పూర్తి చేశాడు. 40 టెస్ట్ ఇన్నింగ్స్‌లో పూర్తి చేసి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. దీంతో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో రెండు వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. జైస్వాల్‌కు ముందు రాహుల్ ద్రవిడ్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్‌లో రెండు వేల పరుగులు పూర్తి చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..