WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన

WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన


WPL 2026 Final Winner : వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సంచలన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన, యువ సంచలనం జార్జియా వోల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో బెంగళూరు జట్టు చరిత్ర సృష్టించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, జెమిమా రోడ్రిగ్స్ (57), లారా వోల్వార్డ్ (44), చినెల్ హెన్రీ (35*) మెరుపులతో 203 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది డబ్ల్యూపీఎల్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు. అయితే, ఛేజింగ్‌లో ఆర్‌సీబీకి మొదట్లోనే షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ గ్రేస్ హారిస్ కేవలం 9 పరుగులకే అవుట్ కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ, కెప్టెన్ స్మృతి మంధాన, ఆస్ట్రేలియా యువ ప్లేయర్ జార్జియా వోల్ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *