WPL 2026: ఆర్సీబీ వండర్ ఫుల్ విక్టరీ.. కట్‌చేస్తే.. మరపురాని మెసేజ్ పంపిన కోహ్లీ, అనుష్క.. ఏమన్నారంటే..?

WPL 2026: ఆర్సీబీ వండర్ ఫుల్ విక్టరీ.. కట్‌చేస్తే.. మరపురాని మెసేజ్ పంపిన కోహ్లీ, అనుష్క.. ఏమన్నారంటే..?


Virat Kohli Message After RCB Incredible WPL 2026 Victory: ఢిల్లీ క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ రెండవ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఐపీఎల్ ( IPL 2025), డబ్ల్యూపీఎల్ (WPL 2026) ట్రోఫీలను ఒకేసారి గెలుచుకున్న చరిత్రలో మొట్టమొదటి ఫ్రాంచైజీగా ఆర్సీబీ రికార్డు పుస్తకాలలో తన పేరును లిఖించుకుంది.

ఆర్సీబీ తమ రెండవ డబ్ల్యూపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న సందర్భంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మరపురాని క్షణాలను పంచుకుంటూ ఉమెన్స్ టీంకు శుభాకాంక్షలు అందించారు.

వడోదరలో చివరి బౌండరీ కొట్టిన వెంటనే, విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో జట్టును అభినందిస్తూ.. బెంగళూరు పతాకాన్ని రెపరెపలాడించారు. అలాగే రెండుసార్లు ట్రోఫీని తెచ్చిపెట్టి ఫ్యాన్స్ కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చాడు.

“మళ్ళీ ఛాంపియన్స్. ఆర్సీబీ జెండాను ఎగురవేసినందుకు ధన్యవాదాలు. స్మృతి, మీ మొత్తం జట్టుతోపాటు బృందానికి, ఈ అద్భుతమైన విజయానికి అభినందనలు. మీరు దీనికి నిస్సందేహంగా అర్హులు. ఈ క్షణాన్ని ఆస్వాదించండి, మా అద్భుతమైన అభిమానుల ప్రేమను స్వీకరించండి” అని కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

బాలీవుడ్ ఐకాన్ అనుష్క శర్మ కూడా తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. మహిళా జట్టు విజయాన్ని అభినందించారు. ట్రోఫీని ఎత్తుకున్న జట్టు ఫొటోను షేర్ చేస్తూ, “ఆర్సీబీ మహిళలు మళ్ళీ చేసి చూపించారు. హిస్టరీ రిపీట్” అంటూ రాసుకొచ్చారు.

Virat Kohli Anushka Sharma

డబ్ల్యూపీఎల్ 2026 ఫైనల్లో రికార్డు బద్దలు కొట్టిన ఛేజింగ్..

వరుసగా నాలుగోసారి ఫైనల్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఇది డబ్ల్యూపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యధిక స్కోరుగా నిలిచింది.

స్మృతి మంధాన మాస్టర్ క్లాస్.. కెప్టెన్ 41 బంతుల్లో 87 పరుగులతో ముందుండి జట్టును నడింపించింది. 377 పరుగులతో ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకుంది.

అద్భుత భాగస్వామ్యం: మంధాన, జార్జియా వోల్ (79) 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక విజయవంతమైన పరుగుల వేటగా నిలిచింది.

ఫినిషింగ్ టచ్: చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమైనప్పుడు, రాధా యాదవ్ చాలా కూల్ గా వరుసగా రెండు బౌండరీలు కొట్టి, మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *