Wolf Robots: నిమిషానికి 60 బుల్లెట్లు.. మంచులోనూ తగ్గేది లేదు.. యుద్ధ రంగంలో తోడేలు రోబోలు..

Wolf Robots: నిమిషానికి 60 బుల్లెట్లు.. మంచులోనూ తగ్గేది లేదు.. యుద్ధ రంగంలో తోడేలు రోబోలు..


ప్రస్తుత డిజిటల్ యుగంలో యుద్ధాల్లో కూడా టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. టెక్నాలజీ సాయంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లోనూ టెక్నాలజీ పెద్ద పోషించినట్లు ఈ క్రమంలో చైనా తన సైన్యం కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేపట్టింది. ఈ క్రమంలో తోడేలు రోబోలను తయారు చేసింది. రెండు రోజుల క్రితం సైనికులు తోడేలు రోబోలతో కలిసి డ్రిల్ నిర్వహించారు. ఈ సమయంలో తోడేలు రోబోలు బుల్లెట్లను కాల్చడం వర్షం కురిపించాయి. తోడేలు రోబోలు సాధారణ సైనికుల మాదిరిగానే ప్రతి సెకనుకు ఒక బుల్లె‌ట్‌ను కాల్చింది. ఇది చైనా సైన్యాన్ని అల్ట్రామోడర్న్‌గా మార్చడానికి చేసిన ప్రయత్నం. ఇందులో భాగంగా..  చైనా సైన్యం రోబోటిక్ తోడేళ్లతో ప్రాక్టీస్ చేసింది.

పర్వతాలు – మంచులోనూ..

తోడేలు రోబోలకు సంబంధించి చైనా ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో సాధారణ సైనికుల మాదిరగానే.. తోడేలు మెట్లు, పర్వతాలు ఎక్కడం గమనార్హం. గుట్టల్లోనూ ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఆ తర్వాత మంచు ప్రాంతాల్లోనూ సైనికులతో కలిసి తోడేలు రోబోలు విజయవంతంగా డ్రిల్ నిర్వహించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2024లో ప్రకటన

2024లో చైనా మొదటిసారిగా తన సైన్యంలో డోడేలు రోబోటిక్స్ గురించి వెల్లడించింది. ఆ సమయంలో కొన్ని చిత్రాలను కూడా విడుదల చేశారు. తోడేలు లోపల QBZ-191 అస్సాల్ట్ రైఫిల్‌ను అమర్చారు. దాంతో అది సులభంగా కాల్పులు జరపగలదు. గ్లోబల్ టైమ్స్ ప్రకారం.. రోబో తోడేలు బరువు దాదాపు 70 కేజీలు. తోడేలును చైనా సౌత్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్ తయారు చేసింది. ఇవి లక్ష్యాలను న్యూట్రలైజ్ చేయడంతో పాటు నిఘా కార్యకలాపాలను నిర్వహించగలదు. ఇవి పరికరాలను రవాణా చేయడంతో పాటు సహాయక కార్యకలాపాలను నిర్వహించగలదు.

వోల్ఫ్ రోబోట్ సంక్లిష్ట భూభాగాలలో, మంచులోనూ పోరాడగలవని చైనా అధికారవ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల రానున్న రోజుల్లో యుద్ధాలను మార్చగల సత్తా వీటికి ఉందని తెలిపాయి. ఈ రోబోలు పట్టణ ప్రాంతాలు, ఎత్తైన పీఠభూములు, పర్వత ప్రాంతాలలో సైనిక సిబ్బంది పోరాట సామర్థ్యాలను పెంచుతాయి అభిప్రాయపడ్డారు. వైమానిక డ్రోన్‌ల కంటే వోల్ఫ్ రోబోట్‌ల మోహరింపు మరింత ప్రభావవంతంగా ఉంటుందని చైనా సైనిక నిపుణులు భావిస్తున్నారు.

చైనాకు సరిహద్దు వివాదాలు

విస్తరణవాద మనస్తత్వం కలిగిన చైనాకు ప్రస్తుతం జపాన్, ఫిలిప్పీన్స్, తైవాన్, భారతదేశం వంటి దేశాలతో సరిహద్దు వివాదలు ఉన్నాయి. అదే సమయంలో అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో ఆధిపత్యం కోసం పోరాడుతోంది. చైనా తైవాన్‌ను రెచ్చగొడితే, దానిని వదిలిపెట్టబోమని బ్రిటన్ ఇటీవల ప్రకటించింది. అమెరికా కూడా తైవాన్‌కు మద్దతుగా ఉంది. లేహ్-లడఖ్ మరియు ఈశాన్య సరిహద్దులో చైనాకు భారత్‌తో వివాదాల ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *