Wild Honey: జుంటి తేనె మీకు తెలుసా..? అడవిలో దొరికే అమృతం…

Wild Honey: జుంటి తేనె మీకు తెలుసా..? అడవిలో దొరికే అమృతం…


మనకు సాధారణంగా తేనె అంటే.. పసుపు రంగులో ఉండే, బాటిల్‌లో దొరికే తీపి పదార్థం గుర్తొస్తుంది. కానీ అడవుల్లో మాత్రం ఇంకా ప్రత్యేకమైన తేనె ఒకటి ఉంటుంది. దాన్నే మన గ్రామీణ ప్రాంతాల్లో జుంటి తేనె అంటారు. ఇది సాధారణ తేనె కంటే అరుదైనది. రుచిలో కూడా తేడా ఉంటుంది. అందుకే దీనికి గ్రామాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. జుంటి తేనెను తయారు చేసేది పెద్ద తేనెటీగలు కాదు. చాలా చిన్నగా ఉండే అడవి తేనెటీగలు. వీటిని కొన్నిచోట్ల చిన్న తేనెటీగలు అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఇవి చెట్ల పొట్టలో, రాళ్ల చీలికల్లో, మట్టి గుంటల్లో లేదా పాత గోడల లోపల.. అలా మన కంటికి కనిపించని చోట్ల గూడు కడతాయి. చిన్న తేనెటీగలు దిబ్బల లోపల, చిన్న కన్నాల ద్వారా ఈ తేనెను నిల్వ చేస్తాయి. ఇది అత్యంత స్వచ్ఛమైన తేనె. ఈ తేనెని వెతకడం కూడా అంత సులువు కాదు. తెలిసినవాళ్లకు మాత్రమే ఇది దొరుకుతుంది. తేనె సేకరణకు కత్తి, చిన్న గునపం వంటి పరికరాలు ఉపయోగిస్తారు. జుంటి తేనె ప్రత్యేకత దాని రుచిలోనే కనిపిస్తుంది. సాధారణ తేనెలా పూర్తిగా తీపి కాకుండా.. ఇందులో కొంచెం పుల్లటి టచ్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు గొంతులోకి దిగేటప్పుడు ఓ చిన్న స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది. ఇదే దీని అసలు గుర్తు. ఈ కారణంగా చాలా మంది దీన్ని అడవి మెడిసిన్‌లా భావిస్తారు. ప్రోపోలిస్‌తో థ్రోట్ స్ప్రేలు, లోజెంజెస్ (గొంతు మాత్రలు) మార్కెట్లో ఉంటాయి.
గొంతు మంట, ఇరిటేషన్ తగ్గించడానికీ వాడతారు.

Also Read: కొండ పిండి కూర.. తిన్నారంటే అద్భుతమే…

గ్రామాల్లో జుంటి తేనెకు చాలా పేరుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వచ్చినప్పుడు.. పెద్దవాళ్లు జుంటి తేనె ఒక స్పూన్ తిను అని చెప్తారు. పిల్లలకు బలంగా ఉంటుందని, అలసట తగ్గుతుందని కూడా కొందరు నమ్ముతారు. అంతేకాదు.. కొందరు పసుపు, మిరియాల పొడి కలిపి కూడా వాడుతారు. ఈ తేనెను సాధారణంగా రోజూ ఎక్కువగా కాకుండా, అవసరమైనప్పుడు మాత్రమే తింటారు. జుంటి తేనెతో పాటు గూడు దగ్గర ఒక నల్లటి పదార్థం కూడా కనిపిస్తుంది. అది సాధారణ మట్టి కాదు. తేనెటీగలు గూడు రక్షణ కోసం తయారు చేసే ప్రోపోలిస్ లాంటి పదార్థం. ఇది కూడా చాలా విలువైనదిగా చెబుతారు. ప్రోపోలిస్‌లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయని చెప్తారు. అందుకే చిన్న గాయాలు, చర్మ ఇన్ఫెక్షన్‌లకు కొన్ని ఆయుర్వేద మందుల్లో వాడతారు.

అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అడవి తేనె కాబట్టి ఇది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కొన్నిసార్లు దాంట్లో మట్టి, చిన్న పురుగులు లేదా ఇతర పదార్థాలు కలిసే అవకాశం ఉంటుంది. అలాగే 1 సంవత్సరం లోపు పిల్లలకు తేనె ఇవ్వకూడదు అనే సాధారణ నియమం జుంటి తేనెకి కూడా వర్తిస్తుంది. అడవుల్లో దొరికే జుంటి తేనె.. మన పూర్వీకుల కాలం నుంచి ఉన్న ఒక ప్రకృతి బహుమతి. దొరికితే అది అదృష్టమే. కానీ దాన్ని తీసుకొచ్చే సమయంలో అడవిలో ఉన్న జీవవ్యవస్థను దెబ్బతీయకుండా, గూడు పూర్తిగా నాశనం చేయకుండా జాగ్రత్తగా తీసుకోవడం కూడా మన బాధ్యత. ఎందుకంటే తేనెటీగలు ఉంటేనే ప్రకృతి ఉంటుంది.. ప్రకృతి ఉంటేనే మన ఆరోగ్యం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *