WhatsApp: వాట్సప్‌ వెబ్‌లో కూడా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.. కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఎలా అంటే..?

WhatsApp: వాట్సప్‌ వెబ్‌లో కూడా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.. కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఎలా అంటే..?


వాట్సప్ వినియోగదారులకు మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు కేవలం వాట్సప్ యాప్‌ లేదా డెస్‌టాప్ వాట్సప్ యాప్‌లో మాత్రమే వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉండేది. దీంతో వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే మొబైల్ యాప్‌ను ఓపెన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పటినుంచి ఆ సమస్య ఉండదు. వాట్సప్ వెబ్ వెర్షన్‌లో కూడా ఇక నుంచి వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వాట్సప్ ఈ ఫీచర్‌ను నిశ్శబ్దంగా ప్రారంభిస్తోంది. చాలామంది వినియోగదారులు సంవత్సరాలుగా ఈ ఫీచర్ గురించి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వారి కల నెరవేరింది.

బ్రౌజర్ నుంచే కాల్స్

ఇక నుంచి వాట్సప్ వెబ్ ద్వారా కూడా వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వెబ్ వెర్షన్‌ను రోజువారీ పనులు, ఛాట్స్ కోసం ఉపయోగించుకునేవారికి ఇది మరింత ఉపయోగకరంగా ఉండనుంది. ఆఫీస్ కాల్స్ మాట్లాకునే ఉద్యోగులతో పాటు విద్యార్థులు, రోజంతా బ్రౌజర్ వాడే వ్యక్తులకు ఇది మంచి ఫీచర్‌గా చెప్పవచ్చు. సమయాన్ని ఆదా చేయడంతో పాటు ప్రతీ పనికి వాట్సప్ మొబైల్ యాప్ ఓపెన్ చేయల్సిన అవసరం తప్పుతుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సప్ వెబ్ వెర్షన్‌లో వన్ టూ వన్ వాయిస్ కాల్స్‌తో పాటు వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తతుం కొంతమందికి మాత్రమే ఈ అప్‌డేట్ కనిపిస్తుండగా.. త్వరలో అందరికీ కనిపించనుంది. ఇక గ్రూప్ కాలింగ్ చేసుకునే అవకాశం లేకపోగా.. భవిష్యత్తులో ఆ ఫీచర్ కూడా ప్రవేశపెట్టేందుకు వాట్సప్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కాల్స్‌కు ఎండ్ టూ ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంతో కాల్‌లోని వ్యక్తులు, వాట్సప్, మోటా సంస్థ మాత్రమే కంటెంట్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఎన్‌క్రిప్షన్ ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. డీఫాల్ట్‌గా అది ప్రారంభించి ఉంటుంది. దీని వల్ల మీరు మాట్లాడే కాల్స్ రహస్యంగా ఉంటాయి. వేరేవాళ్లు యాక్సెస్ చేయడానికి కుదరదు. ఇటీవల వాట్సప్ హ్యాకింగ్ వంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో వెబ్ వెర్షన్లను అనేక భద్రతా ఫీచర్లను వాట్సప్ తీసుకొస్తుంది.

త్వరలో వెబ్ వెర్షన్లలో రానున్న ఫీచర్లు

-వెబ్ వెర్షన్‌లో 32 మంది ఒకేసారి గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం

-వీడియో కాల్స్‌లో చేరాల్సిందిగా లింక్‌లను షేర్ చేయడం

-వీడియో కాల్స్ షెడ్యూల్ ఆప్షన్

-వీడియో కాల్స్ సమయంలో స్క్రీన్ షేరింగ్

-స్క్రీన్ షేరింగ్ వల్ల ఆఫీస్ డాక్యుమెంట్స్ ఇతరులు చూపించవచ్చు

-ఇక విద్యార్థులకు కూడా ఈ ఫీచర్లు ఉపయోగపడనున్నాయి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *