మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. గురు, శుక్ర, రాహు గ్రహాల బలం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతి ఫలం, ప్రోత్సాహకాలు లభించే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగు తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామితో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రవి, బుధ, కుజ, గురు, శుక్ర గ్రహాలు బాగా అనుకూల స్థానాల్లో ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా సాగిపోతుంది. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు, పనులు సవ్యంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా అనుకూలతలు ఏర్పడతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గురు, బుధ, రవి, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా సాను కూల ఫలితాలనిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గ్రహ సంచారంలో రవి, బుధ, కుజులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యా నికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తయి, ఆర్థికంగా లాభం పొందు తారు. వృత్తి, ఉద్యోగ సంబంధమైన సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ బాధ్యతలు పెరు గుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది కానీ, అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. బంధు మిత్రులతో సామరస్యం నెలకొంటుంది. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): లాభ స్థానంలో గురు, శుక్రుల సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కూడా జరుగుతుంది. అష్టమ శనిప్రభావం కూడా చాలావరకు తగ్గి, ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సానుకూలపడతాయి. అయితే, రాశ్యధిపతి రవి వ్యయంలో ఉండడం వల్ల ఖర్చులు అదుపు తప్పుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. నిరుద్యోగులకు అనేక అవకాశాలు అందివస్తాయి. ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త పరిచయాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): దశమ స్థానంలో గురు, శుక్రులు, లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడు, రవి కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి, వేతనాలు పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శత్రు, రోగ, రుణ బాధలు చాలావరకు తగ్గి ఉంటాయి. ఆదాయానికి లోటుండదు కానీ వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఉద్యోగాల్లో అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. సొంత వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): భాగ్య స్థానంలో గురు, శుక్రులు, దశమ స్థానంలో రవి, బుధుల సంచారం వల్ల అటు ఆదాయ పరంగానూ, ఇటు ఉద్యోగపరంగానూ ఉన్నత స్థితిలోనే ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. ఇష్టమైన ప్రాంతాలకు స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొందరు బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింతగా పురోగతి సాధిస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయం బాగావృద్ధి చెందుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): దశమ స్థానంలో రవి, బుధులు, లాభ స్థానంలో రాశ్యధిపతి కుజుడు సంచరిస్తున్నందువల్ల ఉద్యో గంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా బలం పుంజుకుంటాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఇతరుల విషయా లకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. అనవసర ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొందరు బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సవ్యంగా సాగిపోయే అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గురు, శుక్ర, రాహు, కుజులు బాగా అనుకూలంగా ఉద్యోగంలో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్ని కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఇంట్లో శుభ కార్యం తలపెడతారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రవి, బుధ, శని, కుజులు బాగా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం వంటివి జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడంలో ఇబ్బంది పడతారు. బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గురు, శుక్ర, రాహు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నందువల్ల ఉద్యోగంలో స్థిరత్వం లభించడం లేదా హోదా పెరగడం వంటివి జరుగుతాయి. జీతభత్యాలు కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. దానధర్మాలను, ఉచిత సహాయాలను తగ్గించుకోవడం మంచిది. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆర్థిక పరిస్థితి కొద్ది అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పిల్లలు చదువుల్లో ఆశించిన విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు బంధుమిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): చతుర్థ స్థానంలో రాశ్యధిపతి గురువుతో శుక్రుడు కలిసి ఉండడం, పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తిపాస్తుల విలువ పెరగడం, సొంత ఇంటి ప్రయత్నాలు సఫలం కావడం, కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. ఒకటి రెండు దీర్ఘకాలిక వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. స్తోమతకు మించి కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది.