వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): గురు, శుక్ర, శని, రవుల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల రాజపూజ్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఖర్చులకన్నా ఆదాయం బాగా అధికంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్తగా వాహనం కొనే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.