Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్


తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి.. కేవలం తెల్లవారుజామున వేళల్లో మాత్రమే కొంచెం చలి ఉంటోంది.. ఆ తర్వాత ఎండలు పెరుగుతున్నాయి.. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వాతావరణ శాఖ అప్డేట్ ప్రకారం.. నిన్నటి భూమధ్య రేఖా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈ రోజు అనగా ఫిబ్రవరి 18వ తేదీ 2026, 08:30 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా శ్రీలంక వైపు కదులుతూ నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖా హిందూ మహాసముద్రం మీదుగా మరింతగా బలపడే అవకాశం ఉంది.

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దిగువ ట్రోపో ఆవరణములో ఆంధ్రప్రదశ్ – యానములో తూర్పు, ఆగ్నేయ దిశగా వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. దట్టమైన పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

రాయలసీమ:-

బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

గమనిక :- రాగల 2 రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది. కోస్తాంద్రలో రాగల 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా ఆగ్నేయ దిశ నుండి వీచుచున్నవి. వీటి ప్రభావంతో బుధవారం, గురువారం, శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *