Watch Video: సినిమాను మించిన కిడ్నాప్‌ సీన్.. మహిళా ఉద్యోగిని ఎలా ఎత్తుకెళ్లారో చూడండి!

Watch Video: సినిమాను మించిన కిడ్నాప్‌ సీన్.. మహిళా ఉద్యోగిని ఎలా ఎత్తుకెళ్లారో చూడండి!


సచివాలయంలోకి చొరబడి కొందరు దుండగులు గొంతుపై కత్తిపెట్టి సినీ ఫక్కీలో మహిళా ఉద్యోగిని ఎత్తుకెళ్లిన ఘటన అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం శరభవరం పంచాయతీ పరిధిలో వెలుగు చూసింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సౌమ్య అనే యువతిని కొందరు గుర్తు తెలియని దుండగులు సినీ పక్కిలో ఎత్తుకెళ్లారు. సచివాలయంలో సిబ్బంది ఉండగానే లోపలికి ప్రవేశించిన నలుగురు వ్యక్తులు సౌమ్య గొంతుపై కత్తి పెట్టి అక్కడున్న వారందరినీ బెదిరించి ఆమెను కొట్టుకుంటూ బయటకు ఈడ్చుకెల్లారు.

పక్కనే ఉన్న వైస్ సర్పంచ్ వెంకన్న దొర దుండగులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. వారు అతన్ని కూడా కత్తితో బెదిరింపులకు బెదిరించి తప్పించుకున్నారు. బయటకు వెళ్లి AP 31 TJ 1462 నెంబర్ గల ఇన్నోవా కారులో అక్కడి నుంచి నేలకోట అటవీ ప్రాంతం వైపుగా పారిపోయారు.
అయితే దుండగులను గుర్తించిన ఒక మహిళా సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించి పోలీసు అధికారులను అలెర్ట్ చేసింది.

సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా సీసీకెమెరాలను పరిశీలించారు. ఘటనపై స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కిడ్నాప్ సమయంలో సచివాలయ సిబ్బంది దుండగుల నిలదీసే ప్రయత్నం చేశాగా. యువతి తమకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని.. ఎవరైనా కావాలని అతి చేస్తే ఇబ్బందులకు గురవుతారని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు.

అయితే కిడ్నాప్‌కు వచ్చిన క్రమంలో దుండగులు తమ ముఖాలను గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్కులు వేసుకుని సచివాలయంలోకి ప్రవేశించింనట్టు పోలీసులు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా గుర్తించారు. ఇప్పటికే రంపచోడవరం సర్కిల్ డిఎస్పి స్థానిక పోలీసులను అలెర్ట్ చేసి నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *