భీమవరం, జులై 1: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రం శ్రీఉమా సోమేశ్వరజనార్దన స్వామి ఆలయంలో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా శాకాంబరీ అలంకరణ చేశారు. వంద కిలోల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలుతో ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. సోమేశ్వరస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అమ్మవార్లు ప్రత్యేక అలంకరణ చేశారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా శాకాంబరీ అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అన్నపూర్ణాదేవి అంటేనే అందరికీ ఆహరాన్నీ అందించే శక్తి. పంటలు బాగా పండి, ఏ లోటూ లేకుండా ప్రజలంతా ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి శాకాంబరీ అలంకరణ చేస్తారు.
సోమేశ్వరస్వామి ఆలయం అన్నపూర్ణమ్మ అమ్మవారు ప్రత్యేకంగా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సోమేశ్వరస్వామి వారి శిరస్సుపై భాగంలో కొలువై ఉన్నారు అన్నపూర్ణమ్మ. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని వెళితే సకళ సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. దేశ విదేశాల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తుంటారు. పంచారామ క్షేత్రలో ప్రత్యేకంగా శాకాంబరీ అలంకరణలో ఉన్న అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వీరు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.