Watch: వార్నీ.. టిప్పుటాపుగా రైలెక్కింది..టికెట్‌ అడిగిన టీటీఈకి సినిమా చూపించింది..!

Watch: వార్నీ.. టిప్పుటాపుగా రైలెక్కింది..టికెట్‌ అడిగిన టీటీఈకి సినిమా చూపించింది..!


ఒక పౌరుడిగా రైలులో టికెట్‌తో ప్రయాణించడం మన బాధ్యత. కానీ కొంతమంది కొన్నిసార్లు ఈ బాధ్యత విస్మరిస్తుంటారు. టికెట్‌ లేకుండా ధైర్యంగా రైల్లో ప్రయాణిస్తుంటారు. రైల్వే అధికారులకు పట్టుబడినప్పుడు తప్పించుకునేందుకు అన్ని రకాల సాకులు చెప్పడం మొదలుపెడుతుంటారు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ టికెట్‌ లేకుండానే రైలులో ప్రయాణించింది. పట్టుబడినప్పుడు ఆమె TTEకి తన పరిస్థితిని చెబుతోంది.

TTE విధి రైలు, రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల వద్ద టిక్కెట్లను చెక్‌ చేయడం. ఎవరికైనా టికెట్ లేకపోతే, వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. లేదా TTE అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ మహిళ తన వద్ద టికెట్ లేకపోయినా TTE, అతనితో ఉన్న సిబ్బందితో తీవ్రంగా వాదిస్తుంది. అయినప్పటికీ అధికారులు ఆమెను టికెట్‌ చూపించాలని పట్టుబట్టారు.

ఇవి కూడా చదవండి

రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న హై వోల్టేజ్ డ్రామాలో ఒక సర్దార్జీ ఆ మహిళ నుండి బ్యాగ్ తీసుకుంటూ కనిపిస్తాడు. ఆమె బిగ్గరగా అరుస్తుంది. ఇంతలో TTE ఈ మేడమ్ టికెట్ చూపించడం లేదు అని అంటాడు. దానికి ఆ మహిళ ‘మీరు నా పరిస్థితిని చూడాలి’ అని సమాధానం ఇస్తుంది. కానీ, TTE మాత్రం టికెట్‌కు సంబంధించిన ప్రశ్నలను అడుగుతూనే ఉన్నాడు. దాంతో కోపంతో చిర్రెత్తిపోయిన ఆ మహిళ మరింత బిగ్గరగా అరుస్తూ అత్యవసర పరిస్థితి ఉంటూ చెప్పింది. ఆ సర్ధార్‌ జీ సైతం అదే స్థాయిలో ఆమెను టికెట్ చూపించు, లేకపోతే జరిమానా చెల్లించి వెళ్ళు అని అంటాడు. దీనితో 70 సెకన్ల నిడివి గల ఈ వీడియో ముగుస్తుంది.

వీడియో ఇక్కడ చూడండి…

@gharkekalesh ఈ వీడియోను X లో పోస్ట్ చేశారు. దీనికి క్యాప్షన్‌గా ఈ మహిళ టికెట్ చూపించడానికి బదులుగా పరిగెత్తడం ప్రారంభించింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 1 లక్ష 30 వేలకు పైగా వీక్షణలు, 1500 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. వీడియో చూసిన ప్రతిఒక్కరూ స్పందించారు. చూసేందుకు బాగా ధనవంతురాలిగానే కనిపిస్తుంది..అలాంటప్పుడు ఈ డ్రామా అంతా ఎందుకు అంటూ చాలా మంది కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *