Watch: వామ్మో.. ఇదేం చేపరా సామీ.. ఏకంగా పడవంతుంది..! ఈ వెరైటీ ఫిష్ వీడియో చూశారా?​

Watch: వామ్మో.. ఇదేం చేపరా సామీ.. ఏకంగా పడవంతుంది..! ఈ వెరైటీ ఫిష్ వీడియో చూశారా?​


Watch: వామ్మో.. ఇదేం చేపరా సామీ.. ఏకంగా పడవంతుంది..! ఈ వెరైటీ ఫిష్ వీడియో చూశారా?​

మత్స్యకారులకు జీవనాధారం ఆ గంగమ్మ తల్లి ఒడి..ఆ దేవత వారిని ఎప్పుడు, ఏ విధంగా కరుణిస్తుందో.. ఎప్పుడు వరాలు కురిపిస్తుందో తెలియదు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు తిరిగి ఇళ్లు చేరే వరకు వారి కుటుంబ మంతా బిక్కుబిక్కు మంటూ గడపాల్సిందే.. ఇక వేటలో వారికి చాలా సార్లు అంతంత మాత్రంగానే చేపలు పడుతుంటాయి. ఒక్కొక్కసారి తెలియకుండానే అతి భారీ చేపలు, వారి అదృష్టాన్ని మార్చేలా అరుదైన చేపలు కూడా వారి వలలో చిక్కుతుంటాయి. అలాంటి అరుదైన సంఘటన యానాంలో చోటు చేసుకుంది.

యానాం గోదావరిలో మత్స్యకారుల వలకు భారీ టేకుచేప చిక్కింది. పొన్నమండ భీమరాజు బృందం పడవలో వేటకు వెళ్లగా జీఎంసీ బాలయోగి వారధి సమీపంలో 160 కిలోల బరువు, ఎనిమిది అడుగుల చుట్టుకొలత ఉన్న టేకు చేప వలలో పడింది. దానిని అతి కష్టంమీద ఒడ్డుకు చేర్చారు మత్స్యకారులు.. .సముద్రంలో మాత్రమే ఉండే ఈ చేప భైరవపాలెం మొగ ద్వారా గౌతమి గోదావరిలోకి వచ్చి ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు.. . ఈ చేపను పొన్నమండ భద్రం వేలంలో రూ.17వేలకు దక్కించుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఇది ఆపద వస్తుందని గుర్తిస్తే మాత్రం తోకతో తీవ్రంగా దాడి చేస్తుందని మత్స్యకారులు తెలిపారు. అయితే, ఇలాంటి టేకు చేప చిన్నది అయితే మార్కెట్లో అమ్మకాలు జరిపి, వాటాలు వేసి తీసుకుంటూ ఉంటారు. అదే అతి భారీ టేకుచేప అయితే ఎక్కువగా మెడిసిన్ తయారీకి ఉపయోగపడుతుంది. క్యాన్సర్లు,గుండెపోటు నివారణకు దీనిని ఆహారంగా తీసుకుంటారని యానాం మత్స్యశాఖ అసి స్టెంట్ డైరెక్టర్ దడాల గొంతెయ్య తెలిపారు… ఇలాంటి చేపలు అరుదుగా దొరకడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *