Watch: రిషికేశ్‌ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానది.. ఆ మహా శివుని పాదాలను కడుతూ..

Watch: రిషికేశ్‌ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానది.. ఆ మహా శివుని పాదాలను కడుతూ..


ఉత్తరాఖండ్ ప్రస్తుతం పెను విపత్తును ఎదుర్కొంటోంది.  రుతుపవనాల కారణంగా ఉత్తరకాశిలోని ధరాలిలో మేఘాలు విస్ఫోటనం చెందడం రాష్ట్ర పరిస్థితిని మరింత భయానకంగా మార్చింది. చాలా చోట్ల నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అనేక రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ధరాలిలో పరిస్థితి ప్రపంచం మొత్తం నాశనమైనట్లు అనిపిస్తుంది. ఉత్తరకాశి విషాదం ప్రభావం పవిత్ర నగరమైన రిషికేశ్‌లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ గంగా నది ప్రమాద స్థాయికి చేరుకుంది.. ఈ సమయంలో ఒక వింత దృశ్యం కనిపించింది. రిషికేశ్ మధ్యలో ఉన్న శివుని విగ్రహాన్ని తాకుతూ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ గంగమ్మ తల్లి స్వయంగా ఆ మహాదేవుడి పాదాలను కడుగుతున్నట్లుగా ఉంది.

ఉత్తరాఖండ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వర్షాలకు రిషికేశ్‌ వద్ద గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రిషికేశ్‌లోని పరమార్థ నికేతన్‌ ఆశ్రమం వద్ద గంగమ్మ శివుని విగ్రహాన్ని తాకుతోంది. ఇది జూన్ 2013 విపత్తు దృశ్యాన్ని ప్రజలకు గుర్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

ఆదివారం సాయంత్రం ప్రారంభమైన వర్షం మంగళవారం కూడా పూర్తిగా ఆగలేదు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఉదయం, గంగా నది నీటి మట్టం హెచ్చరిక రేఖకు దగ్గరగా చేరుకుంది. వర్షానికి నదులు కూడా పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం వరకు దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉన్నాయి.

రిషికేశ్‌లో గంగా నది 340.50 RL మీటర్ ప్రమాద హెచ్చరికకు చేరుకుంది. ఈ ప్రాంతంలోని కాలానుగుణ నదులు, వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. స్నాన ఘాట్‌కు వెళ్లడాన్ని నిలివేశారు. పోలీసులు నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *