రష్యాలో ఒకవైపు భూకంపం, మరోవైపు అగ్నిపర్వతాల విస్ఫోటనం కల్లోలం రేపుతున్నాయి. ఆదివారం కురిల్ దీవులలో సంభవించిన శక్తివంతమైన భూకంపం, సమీపంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో అగ్నిపర్వతాలు ఉవ్వెత్తున ఎగిసిపడటం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. ప్రకృతి శక్తి విరుచుకుపడటంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 600 సంవత్సరాలలో మొదటిసారిగా కమ్చట్కాలోని క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం రాత్రిపూట విస్ఫోటనం చెందడం, గత వారం రష్యా దూర ప్రాచ్యాన్ని కుదిపేసిన భారీ భూకంపంతో ముడిపడి ఉండవచ్చని రష్యాకు చెందిన RIA రాష్ట్ర వార్తా సంస్థ, శాస్త్రవేత్తలు నివేదించారు.
600 సంవత్సరాలలో క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ఇదే మొదటిసారి అని కమ్చట్కా అగ్నిపర్వత విస్ఫోటన ప్రతిస్పందన బృందం అధిపతి ఓల్గా గిరినా చెప్పినట్లు RIA పేర్కొంది. బుధవారం సంభవించిన భూకంపంతో ఈ విస్ఫోటనం ముడిపడి ఉండవచ్చని, దీని కారణంగా ఫ్రెంచ్ పాలినేషియా, చిలీ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయని, ఆ తర్వాత కమ్చట్కా ద్వీపకల్పంలో అత్యంత చురుకైన అగ్నిపర్వతం అయిన క్లూచెవ్స్కోయ్ విస్ఫోటనం సంభవించిందని వారు వివరాలు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
WATCH: Incredible footage of the FIRST RECORDED ERUPTION of Krasheninnikov volcano in Kamchatka, Russia.
It wouldn’t be a surprise to me if it was triggered by the megathrust M8.8 earthquake a few days ago.
Krasheninnikov volcano began its FIRST RECORDED eruption at 16:50 UTC… pic.twitter.com/FpUKRo9dLG
— Volcaholic 🌋 (@volcaholic1) August 3, 2025
అగ్నిపర్వతం పేలిన అనంతరం కొన్ని కిలోమీటర్ల వరకు బూడిద.. 6,000 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడింది. క్రాషెనిన్నికోవ్ చివరి విస్ఫోటనం 1463లో సంభవించిందని చెప్పారు. అప్పటి నుండి ఎటువంటి పేలుళ్లు నమోదు కాలేదని RIA రాష్ట్ర వార్తా సంస్థ వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…