ఏనుగు పిల్ల చేష్టలను చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. వాటి ఆటలు, చేష్టలు చూస్తుంటే వాటిని కౌగిలించుకోవాలనిపిస్తుంది. ఏనుగులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఆ ఏనుగులు చిన్న పిల్లల్లా ఆడుకుంటాయి, సహచరులతోనే కాకుండా మనుషులతో కూడా ఆప్యాయంగా ప్రవర్తిస్తాయి. తాజాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్, తల్లిని కోల్పోయిన రెండు పిల్ల ఏనుగులను చేరిదీసి ఆశ్రయం ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒకదానికొకటి తోసుకుంటూ, కలిసి ఆహారం తింటున్నాయి. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమ ప్రశంసలను వ్యక్తం చేశారు.
ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను @ParveenKaswan అనే X ఖాతాలో షేర్ చేస్తూ, “గజరాజ్.. తీస్తా అనే రెండు ఏనుగు పిల్లలను కలిశాను. వాటి తల్లులు మరణించిన తర్వాత అవి అనాథలుగా మారాయి. తల్లిని కోల్పోయిన ఈ పిల్లలను రక్షించారు. ఇప్పుడు అవి తమ సంరక్షణలో సంతోషంగా ఉన్నాయి.” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
While on field, met Gajraj and Teesta yesterday who wanted their toll taxes. Both were rescued after their mothers died and they were abandoned. Now under able care of our Mahauts, they keep exploring the nearby forest. pic.twitter.com/U7kAQ0kfUK
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 6, 2025
ఈ వీడియోలో, మీరు రెండు ఏనుగు పిల్లలు ఒకదానికొకటి సున్నితంగా తోసుకోవడం, కలిసి తినడం, అటవీ సిబ్బందితో సరదా ఆటలు ఆడుతుండటం చూడవచ్చు. ఆగస్టు 6న షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు నలభై వేలకు పైగా వీవ్స్ వచ్చాయి. ఈ ఏనుగుల వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అటవీ అధికారులను అభినందిస్తున్నారు. ఒక వినియోగదారుడు, “ఇది నిజంగా హృదయాన్ని కదిలించేది, గజరాజ్.. తీస్తా అటవీ అధికారుల చేతుల్లో పెరుగుతున్న తీరు చూస్తుంటే సంతోషంగా ఉంది” అని అన్నారు. మరొకరు, “ఇలాంటి వీడియోలను చూడటం చాలా ఆనందంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..