Watch: ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు జంకుతున్న జనాలు!

Watch: ఆ గ్రామంలో కుప్పలు తెప్పులుగా కోతుల గుంపులు.. బయటకెళ్లేందుకు జంకుతున్న జనాలు!


లవకుశులు నడయాడిన నేల వాల్మీడీలో వానరసేనలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా వేలాది కోతులు ఇక్కడి ప్రజలను హడలెత్తిపోయేలా చేస్తున్నాయి. స్థానికుల ఇళ్లలోకి చొరబడి గృహోపకరణాలు చిందరవందర చేస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా రెండు కోతుల గుంపుల మధ్య జరిగిన భీకర యుద్ధం ఊరి ప్రజలందరూ ఉలిక్కిపడిలే చేసింది.

వాల్మీకి జన్మించిన గడ్డ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వాల్మీడీ గ్రామాన్ని వానరసేనలు చుట్టుముట్టాయి.. ఎక్కడెక్కడి నుండో వచ్చిన వానరాలు ఊరంతా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. వేలాది కోతులతో ఇక్కడ పరిస్థితులు కిష్కిందకాండలా మారిపోయాయి. తాజాగా గ్రామంలో రెండు కోతుల గుంపుల మధ్య జరిగిన గొడవ.. ఊరి ప్రజలనంతా వనికిపోయేలా చేసింది. గ్రామంలో ఒకేసారి వేలాదిగా కోతులు ఎదురుపడడంతో రెండు గ్రూపుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ దాడిలో రెండు గ్రూపుల కోతులు పరస్పరం రక్కుకొని రక్తాలు వచ్చేలా బీభత్సం సృష్టించాయి.. కోతుల మధ్య ఈ భీకర యుద్దాలన్ని చూసిన జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో జనాలంతా ఇళ్లలోకి పరుగులు పెట్టారు.

వాల్మీడీ గ్రామంలో వానరాల సంచారంతో జనాలు మొత్తం హడలెత్తిపోతున్నారు. బయటకు వెళ్తే ఏ కోతి దాడి చేస్తుందోననే భయంతో ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పిల్లలు, పెద్దలు ఒంటరిగా రోడ్డు పై వెళ్ళాలంటే వణికిపోతున్నారు. ముఖ్యంగా కిరాణా దుకాణాలు వ్యాపారులు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వానరాలు కేవలం ఇళ్లపై దాడి చేయడమే కాకుండా గ్రామంలోని పొలాలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ఈ కోతుల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *