Watch: “అతిథి దేవో భవ!” అన్న మాటకు సార్థకం చేసిన భారతీయ మహిళ.. ఆశ్చర్యపోయిన విదేశీ ప్రయాణికురాలు!

Watch: “అతిథి దేవో భవ!” అన్న మాటకు సార్థకం చేసిన భారతీయ మహిళ.. ఆశ్చర్యపోయిన విదేశీ ప్రయాణికురాలు!


భారతదేశంలో “అతిథి దేవో భవ” అనే సంప్రదాయం ఉంది. అంటే అతిథి దేవుడితో సమానం. అందువల్ల, మన దేశాన్ని సందర్శించే ప్రతి విదేశీయుడిని మనం భారతీయులు గౌరవిస్తాము. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇది “అతిథి దేవో భవ” సంప్రదాయానికి అద్భుతమైన ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. హర్యానాలోని గ్రామీణ ప్రాంతాన్ని సందర్శించడానికి నెదర్లాండ్స్ నుండి వచ్చింది ఒంటరి మహిళా ప్రయాణికురాలు. అది తెలియని దేశం, అక్కడి ప్రజలు తెలియదు, కానీ అక్కడ ఆమెకు కలిగిన అనుభవం ఆమె హృదయాన్ని మాత్రమే కాకుండా ఇంటర్నెట్ వినియోగదారులందరి హృదయాలను కూడా గెలుచుకుంది.

నెదర్లాండ్స్‌కు చెందిన మీకే హిజ్మాన్ అనే ఒక విదేశీ మహిళ ప్రయాణికులు హర్యానా రాష్ట్రానికి వచ్చింది. బైక్ పై వచ్చి ఒక భారతీయ మహిళను, ఆమె కొడుకును తాను ఉండటానికి ఆశ్రయం కోరింది. టెంటు వేసి రాత్రి గడపడానికి సురక్షితమైన స్థలం కోసం అడిగింది. స్థానిక మహిళ, ఆమె కొడుకు తర్వాత ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. ఆ విదేశీ మహిళ తమ పొలంలో తన టెంటు వేసుకోవడానికి అనుమతించకుండా, వారు ఆమెను తమ ఇంటికి ఆహ్వానించారు. ఆమె బస చేయడానికి స్థలం కల్పించడమే కాకుండా, ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా తినిపించి, ఆమెను అతిథిలా చూసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, నెటిజన్లు గ్రామీణ మహిళను ప్రశంసించారు.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @venom1s అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేశారు. “నెదర్లాండ్స్‌కు చెందిన మీకే హిజ్మాన్ అనే సోలో మహిళా ప్రయాణికురాలు హర్యానాలో ప్రయాణిస్తున్నారు. ఆమె తను ఉండేందుకు మీ పొలంలో టెంటు వేసుకోవచ్చా అని ఒక వృద్ధ భారతీయ మహిళను అడిగింది. ఆమెకు ఇంగ్లీష్ అర్థం కాలేదు. ఇంతలో ఆమె తన కుమారుడు తుషార్ గుజ్జర్‌ను తీసుకువచ్చింది. అయితే ఆమె తల్లి వారిని తమ ఇంటికి ఆహ్వానించి భోజనం, టీ, వసతి కల్పించారు. వారు నెదర్లాండ్స్ టూరిస్టును బాగా చూసుకున్నారు. భారతీయులకు ‘అతిథి దేవో భవ’ అనే సంప్రదాయం ఉంది, అక్కడ వారు అపరిచితులను గౌరవంగా దాతృత్వంతో స్వాగతిస్తారు., ఎంత దూరం నుండి వచ్చినప్పటికీ వారిని కుటుంబంలా చూసుకుంటారు.” అని కాప్షన్ ఇచ్చారు.

ఈ 42 సెకన్ల వీడియోను 1,66,000 సార్లు వీక్షించారు. వేలాది మంది లైక్‌లు, వివిధ రకాల ప్రతిస్పందనలు వచ్చాయి. “సనాతన ధర్మం ప్రధాన సందేశం వివక్షత లేకుండా సేవ, గౌరవం. ఈ వీడియో ఆ ప్రధాన సారాంశాన్ని జీవితానికి తీసుకువస్తుంది. ప్రతి మనిషిలో అతిథి దేవుడిని చూసే మార్గంలోకి తిరిగి రావాలని మనకు గుర్తు చేస్తుంది.” అని ఒక వినియోగదారు రాశారు. మరొక వినియోగదారు, “గ్రామీణ భారతదేశం ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద మంచి హృదయాలను కలిగి ఉంది. కెమెరాలు లేవు, వేషధారణ లేదు, నిజమైన మానవత్వం మాత్రమే.” అని పేర్కొన్నారు.

వీడియోను ఇక్కడ చూడండిః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *