పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అంతర్జాతీయంగా తీవ్ర అవమానానికి గురయ్యారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భద్రతా అధికారులు ఆయన గుర్తింపు కార్డు కోసం ఆపారు. ఆయన గుర్తింపు కార్డును తనిఖీ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, జర్మనీలో జరుగుతున్న కాన్ఫరెన్స్‌లోకి ప్రవేశించే ముందు తన ఐడి కార్డును ప్రదర్శించమని ఒక భద్రతా అధికారి అడిగారు.. అతని పేరు, బ్యాడ్జ్ వైపు చూపిస్తూ, ఆ అధికారి, “మీరు దానిని తిప్పగలరా?” అని అడిగాడు. “అంటే, మీ ఐడి కార్డును ముందు వైపుకు తిప్పండి.” అని సూచించాడు. దీంతో ఐడీ చూపించిన తర్వాత గానీ అసిమ్ మునీర్‌ను లోపలికి అనుమతించలేదు భద్రతా సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలావుంటే, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తన బృందంతో కలిసి మ్యూనిచ్ భద్రతా సమావేశానికి హాజరయ్యారు. ప్రవేశ ద్వారం వద్ద సాధారణ భద్రతా తనిఖీ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అయితే చాలామంది దీనిని సాధారణ భద్రతా తనిఖీ అని తోసిపుచ్చుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
UPDATE!!Field Marshal Army Chief Asim Munir arrives for Munich Security Conference in Germany pic.twitter.com/v4PQpW4z77
— HTN World (@htnworld) February 14, 2026
మరోవైపు, జర్మనీకి చెందిన సింధీ రాజకీయ సంస్థ జీ సింధ్ ముత్తహిదా మహాజ్ (JSMM) అసిమ్ మునిన్ సమావేశంలో పాల్గొనడాన్ని నిరసించింది. ఆ సంస్థ సభ్యులు వేదిక వెలుపల నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, జర్మన్ ప్రభుత్వానికి JSMM చైర్మన్ షఫీ బర్ఫత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అటువంటి ప్రపంచ వేదికపై వారి ఉనికి ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
మ్యూనిచ్ భద్రతా సమావేశం అనేది ప్రతి సంవత్సరం జరిగే ఒక ప్రధాన అంతర్జాతీయ వేదిక. ఇక్కడ ప్రపంచ నాయకులు, దౌత్యవేత్తలు, భద్రతా నిపుణులు ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను చర్చిస్తారు. సంభాషణ, సంఘర్షణ పరిష్కారానికి మ్యూనిచ్ భద్రతా సమావేశం ఒక ముఖ్యమైన వేదికగా పరిగణిస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..