War 2 : వార్ 2 కొత్త ప్రోమో షేర్ చేసిన ఎన్టీఆర్.. వీడియో అదిరిపోయిందిగా…

War 2 : వార్ 2 కొత్త ప్రోమో షేర్ చేసిన ఎన్టీఆర్.. వీడియో అదిరిపోయిందిగా…


పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, బీటౌన్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసిన మేకర్స్…ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్ట్ 14న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటే..ఇప్పటికే బుక్ మై షోలో వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎన్టీఆర్ ఆసక్తికర వీడియో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌లను సూపర్-స్పైస్ కబీర్, విక్రమ్‌లుగా హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాల్లో చూపించే థ్రిల్లింగ్ కొత్త ప్రోమోను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తూ.. “అన్‌స్టాపబుల్ యాక్షన్. అన్‏లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. వార్ 2 ఆగస్ట్ 14 నుంచి థియేటర్లలో సందడి చేయబోతుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో హిందీ, తెలుగు & తమిళ భాషలలో విడుదలవుతోంది #YRFSpyUniverse” అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. ఇక వార్ 2 నుంచి కొత్త ప్రోమోను ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అందులో తారక్, హృతిక్ రోషన్ ఇద్దరి పాత్రలను హైలెట్ చేస్తూ చూపించిన విధానం గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

నివేదికల ప్రకారం ఈ సినిమా భారతదేశం అంతటా 5000 స్క్రీన్లలో రిలీజ్ కానుంది. ఇప్పటివరకు ఈ స్థాయిలో విడుదల కానున్న సినిమా ఇది కావడం విశేషం. ఈ సంవత్సరంలో అత్యధిక ఓపెనింగ్స్‌ను అందించగలదని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ఏక్ థా టైగర్’ తో ప్రారంభమై ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’ ‘టైగర్ 3’ లతో ఉన్న YRF బ్లాక్ బస్టర్ స్పై యూనివర్స్‌లో భాగమైన ఈ ఆరవ భాగంలో హృతిక్ మరోసారి మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రను పోషించనున్నాడు. ఇక ఎన్టీఆర్ విక్రమ్ పాత్రలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి :  Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *