War 2: తారక్ కల్ట్ ఇమేజ్‌కి ఇదే నిదర్శనం.. వార్ 2 కోసం ఇప్పటివరకు లేని విధంగా

War 2: తారక్ కల్ట్ ఇమేజ్‌కి ఇదే నిదర్శనం..  వార్ 2 కోసం ఇప్పటివరకు లేని విధంగా


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పేది ఏముంది. కోట్లలో అభిమానులు ఉంటారు. ఇక మనోడి సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. పండగ వాతావరణమే ఉంటుంది. తారక్ సినిమాల ఫంక్షన్స్‌కు కూడా వేలాదిమంది ఫ్యాన్స్ తరలివస్తారు. తమ అభిమాన హీరోని డైరెక్ట్‌గా చూడాలని ఎన్నో వ్యయప్రయసాలకు ఓర్చి ఆ వేదికల వద్దకు చేరుకుంటారు. తాజాగా ఆదివారం, ఆగస్టు 10న ఎన్టీఆర్ నటించిన వార్ 2 ప్రి రిలీజ్ ఈవెంట్ యూసఫ్‌గూడ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. ఈ మూవీలో హృతిక్ రోషన్‌తో తలపడే ప్రతినాయకుడి ఛాయలున్న రోల్ పోషించారు. ఈ వేడుకకు భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చిన నేపథ్యంలో ముందస్తు ప్రణాళికగా పక్కా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ప్లాన్ చేశారు.

ఎన్టీఆర్ అభిమానుల భద్రత కోసం ఏకంగా.. 1200 మంది పోలీసులను రంగంలోకి దింగారు. వేదిక ఎంట్రీ వద్ద ఎలాంటి తోపులాట, తొక్కిసలాటలు జరగకుండా… ఏకంగా కిలోమీటర్లు దూరం వరకు జిగ్ జాగ్‌తో కూడిన బారీకేడ్స్ ఏర్పాటు చేశారు. తారక్‌తో పాటు హృతిక్ ఇతర తారాగణం అంతా ఈ వేడుకకు హాజరవుతున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదల అవ్వనుంది. అయితే ఈవెంట్ వద్ద నిర్వహణ లోపాలు ఉన్నట్లు అభిమానులు చెబుతున్నారు. సెలబ్రెటి పాసులు కొన్ని ఇష్యూ చేశారు. అవి తీసుకుని వెళ్లినవారిని సైతం.. ఆ మార్గం గుండా అనుమతించడం లేదు. ఎటు వెళ్లాలో కూడా చెప్పడం లేదు. దీంతో గందరగోళం నెలకుంది. మరోవైపు ఈవెంట్‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మరికాసేపట్లో నగరానికి భారీ వర్ష సూచన చేసింది వెదర్ డిపార్ట్‌మెంట్. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *