Vizag: రోడ్డు పక్కన మురుగు కాలువ నుంచి బరా.. బరా అని చప్పుళ్లు.. ఏంటా అని చూడగా..

Vizag: రోడ్డు పక్కన మురుగు కాలువ నుంచి బరా.. బరా అని చప్పుళ్లు.. ఏంటా అని చూడగా..


అది.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని వేపగుంట సింహపురి లే అవుట్. అందరూ ఆ రోడ్డు మార్గంలో వస్తూపోతున్నారు. పిల్లలు పెద్దలు ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో రోడ్డు పక్కనే ఉన్న కాలువలో ఏదో చిన్న అలజడి. బరా బరా శబ్దాలు వస్తున్నాయ్..  ఏమిటా అని కాస్త తొంగి చూస్తే.. కదల్లేని స్థితిలో కనిపించింది భారీ కొండచిలువ. దాదాపు పది అడుగులు ఉంటుంది. ఒక్కసారిగా దాన్ని చూసినవాళ్లు భయంతో పరుగులు తీశారు. విషయం ఆ నోట ఈ నోటా కాపడంతో ఆందోళన మొదలైంది.

సమాచారాన్ని స్నేక్ క్యాచర్ మణికి అందించారు. రంగంలోకి దిగిన మణి.. కాలువలో ఉన్న పామును పట్టుకునేందుకు యత్నించాడు. అయితే.. ఆ భారీ సర్పం చిక్కినట్టుగా చిక్కి మళ్లీ పట్టు తప్పింది. ఆహారం కడుపునిండా మింగి.. భారీ కాయంతో కదలని స్థితిలో ఉంది. ఎట్టకేలకు అత్యంత చాకచక్యంగా.. మరొకరి సహకారం తీసుకున్న మణి.. కొండచిలువను రెస్క్యూ చేశాడు. కాలువలోంచి పైకి తీసి.. ఆ భారీ పైథాన్‌ను పట్టుకొని అడవుల్లో విడిచిపెట్టాడు. స్థానికులంతా ఊపిరి పీల్చుకొని.. స్నేక్ కేచర్ మణిని అభినందించారు. ఇలాంటి పాములు, వన్యప్రాణాలు కనిపిస్తే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలి తప్పతే.. వాటికి హాని కలిగించకూడదు. ఈ ప్రపంచం కేవలం మనుషులది మాత్రమే కాదు.. అన్ని జీవరాశులది అని అందరూ ఎరిగి ప్రవర్తించాలి.

వీడియో దిగువన చూడండి… 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *