ఆయనో రౌడీ షీటర్.. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడు.. మద్యం తాగి బెదిరింపులు ప్రారంభించాడు.. స్మశాన వాటికలో వెళ్లి అక్కడ సిబ్బందిని బెదిరించాడు… చంపేస్తానని కత్తి తీసాడు.. దీంతో ప్రాణభయంతో ఎదురు దాడి చేశారు అక్కడ సిబ్బంది. గడ్డపారతో తలపై మోదడంతో రౌడీ షీటర్ ప్రణాలు కోల్పోయాడు.
విశాఖ వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ నాగమణి ఎల్లాజీ (35) జ్ఞానాపురం శ్మశానవాటికలో హత్యకు గురయ్యాడు. కొంతమంది స్నేహితులను వెంటపెట్టుకుని శ్మశానవాటికకు వెళ్లిన ఎల్లాజీ…అక్కడ పనిచేస్తున్న వారిని డబ్బులు డిమాండ్ చేశాడు. తమ వద్ద లేవని వారు సమాధానం చెప్పినా వినకుండా బెదిరించాడు. వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో ఎల్లాజీ తన జేబులో ఉన్న చాకు తీసి నరసింహమూర్తి, గణేష్‌ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో నరసింహమూర్తి తన చేతిలో ఉన్న గడ్డపారతో ఎల్లాజీ తలపై మోదాడు. అక్కడికక్కడే ఎల్లాజీ మృతిచెందాడు. కంచరపాలెం పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా హత్యకు గురైన ఎల్లాజీ గత నెల 23న జైలు నుంచి విడుదలయ్యాడు. మృతుడు ఎల్లాజీపై వన్ టౌన్ లో రౌడీ షీట్.. వన్ టౌన్ టూ టౌన్ ఫోర్త్ టౌన్ సహ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఎల్లాజీ హత్యలో ప్రధాన నిందితుడుతో పాటు అతనికి సహకరించిన మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..