ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. డ్రైవర్‌లెస్ కారు కల సాక్షాత్కారమైంది. ఓ కారు దానికదే పూర్తి స్థాయిలో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ రోడ్ల మీద పరుగులు పెట్టింది. అమెరికాకు చెందిన టెస్లా మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు రోడ్ల మీద పరుగులు పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో ఎవరూ కూర్చోకుండానే ఫ్యాక్టరీ నుంచి నేరుగా ఆర్డర్ ఇచ్చిన యజమాని ఇంటికి చేరింది.
‘టెస్లా మోడల్ వై’ పేరుతో డ్రైవర్‌లెస్ కారును తాయరు చేసింది. ఈ కారు కేవలం 30 నిమిషాల్లోనే హైవేలు, ట్రాఫిక్ సిగ్నళ్లు దాటుకుంటూ యజమాని ఇంటికి దానికదే డెలివరీ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోను టెస్లా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఫ్యాక్టరీ నుంచి దానికదే స్టార్ట్ చేసుకుని కారు బయలుదేరింది. రహదారిపై ఉన్న ట్రాఫిక్‌కును గమనిస్తూ వేగాన్ని పెంచుకుంటూ, తగ్గించుకుంటూ అచ్చం మనిషి నడిపనట్లే పరుగులు పెట్టింది. మలుపుల దగ్గర మళ్లింది. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర ఆగింది. పక్క నుంచి వెళ్లే ఇతర వాహనాలకు సైడ్ ఇచ్చింది. పలు వాహనాలను ఓవర్ టేక్ చేసింది. యజమాని ఇంటిలో నేరుగా దానికదే పార్కింగ్ చేసుకుంది.
వీడియో చూడండి:
World’s first autonomous delivery of a car!
This Tesla drove itself from Gigafactory Texas to its new owner’s home ~30min away — crossing parking lots, highways & the city to reach its new owner pic.twitter.com/WFSIaEU6Oq
— Tesla (@Tesla) June 28, 2025
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టెస్లా టీమ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ కారు లోపల ఎవరూ లేరు. బయట నుంచి కూడా ఎవరు ఆపరేట్ చేయలేదు. ఇది పూర్తిగా ఆటోమేటిక్ ప్రయాణం. డ్రైవర్ లేకుండా, రిమోట్‌తో ఆపరేట్ చేయకుండా రహదారులపై జరిగిన మొట్టమొదటి ప్రయాణం కూడా ఇదే కావొచ్చు అని మస్క్ అన్నారు.