Viral Video: సడన్‌ బ్రేక్ వేసిన డ్రైవర్‌.. తల్లి ఒడిలోంచి ఎగిరి రోడ్డుపై పడిపోయిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే!

Viral Video: సడన్‌ బ్రేక్ వేసిన డ్రైవర్‌.. తల్లి ఒడిలోంచి ఎగిరి రోడ్డుపై పడిపోయిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే!


బస్సులో వెళ్తుండగా డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంలో డోర్‌ వద్ద కూర్చున్న మహిళ చేతితో ఉన్న బిడ్డ ఎగిరి రోడ్డుపై పడిపోయిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ వీడియో ప్రకారం.. తమిళనాడులోకి ముత్తురామలింగపురం ప్రాంతానికి చెందిన ఒక తన సోదరుడు, పిల్లలతో పాటు ఒక ప్రైవేలు బస్సులో ప్రయాణిస్తుంది. అయితే ఆమె, తన సోదరుడితో పాటు బస్సు డోర్‌ పక్కన ఉన్న సీట్‌లో కూర్చుంది. అయితే ఆ మహిళ ఒక బిడ్డను ఎత్తుకొని.. ఇంకొ బిడ్డను తన సోదరుడి ఒడిలో కూర్చోపెట్టింది.

అయితే వారు ప్రయాణిస్తున్న శ్రీవిల్లిపుత్తూరులోని మీనాక్షిపురం సమీపంలోరి రాగానే బస్సు డ్రైవర్ సడన్‌గా బ్రేక్‌ వేశాడు. దీంతో డోర్‌ పక్కన కూర్చున్న మహిళ చేతిలో ఉన్న బిడ్డ ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. పక్కసీట్లో కూర్చున్న ఆమె సోదరుడు కూడా బస్సులో కిందపడిపోయాడు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశాడు. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపేశాడు. బస్సు ఆగిన వెంబడే తల్లి కిందకు దిగి బాబును ఎత్తుకుంది. పై నుంచి పడిపోవడంతో బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి.

బస్సులో ఉన్న సదరు ప్రయాణికులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి బాలుడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం బాలుడికి హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మొత్తం బస్సులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ కావడంతో ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *