కొన్ని దృశ్యాలను చూస్తే భయంకరంగా ఉంటుంటాయి. కానీ ఈ భయానక దృశ్యం కెమెరాలో బంధించినప్పుడు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూస్తే ఒళ్లు వణికిపోతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ భయంకర వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఓ పెద్ద కొండ చిలువ ఓ మేకను మింగేసింది. తర్వాత ఆ కొండ చిలువ ఉబ్బిపోతుంది. తర్వాత దానిని బయటకు తీసే దృశ్యాన్ని చూస్తే షాకవ్వాల్సిందే.
ఇది కూడా చదవండి: Mobiles Block: సిమ్ కార్డులనే కాదు.. ఫోన్‌లను కూడా.. 27 లక్షల మొబైళ్లను బ్లాక్‌చేసిన కేంద్రం.. ఎందుకంటే..
కొండచిలువ బతికి ఉన్న మేకను మింగేసింది:
ఇవి కూడా చదవండి
అయితే ఓ మేకను కొండచిలువ సజీవంగానే మింగేసింది. వీడియోలో ఒక పెద్ద కొండచిలువ చిత్తడి నేల అంచున నిస్సహాయంగా పడి ఉన్నట్లు చూడవచ్చు. దాని శరీరం మధ్య భాగం చాలా ఉబ్బినట్లుగా ఉంటుంది. కొన్ని క్షణాల తర్వాత ఆ కొండచిలువ తన నోటితో బలాన్ని ప్రయోగిస్తూ మింగిన మేకను బయటకు తీస్తున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.
ఆ కొండచిలువ చివరికి తన నోటి నుండి చనిపోయిన మేకను బయటకు తీస్తుంది. కొండచిలువలు వంటి పాములు పెద్ద పెద్ద జంతువులను సైతం మింగగలవు. కానీ మింగిన తర్వాత దాని జీర్ణవ్యవస్థకు హాని కలిగినట్లయితే వెంటనే బయటకు తీసేస్తుంది. అయితే ఇలాంటి భారీ జంతువులను తిన్న తర్వాత దాని ఆరోగ్యం క్షీణించడం, లేదా ఒత్తిడిగా అనిపించినట్లయితే వెంటనే బయటకు తోసేయడం తరచుగా జరుగుతుంటుందని జంతు నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చేది అప్పుడే..!
ఇది కూడా చదవండి: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. రీల్స్ చేద్దామని వెళ్తే.. చివరికి జరిగిందిదే