Viral Video: వీళ్లెవరండి బాబు.. నాకంటే ఘోరంగా ఉన్నారు… బాయ్స్‌ చేష్టలకు కోతి స్టన్నింగ్‌ రియాక్షన్‌!

Viral Video: వీళ్లెవరండి బాబు.. నాకంటే ఘోరంగా ఉన్నారు… బాయ్స్‌ చేష్టలకు కోతి స్టన్నింగ్‌ రియాక్షన్‌!


మనిషి రూపానికి దగ్గరగా ఉండే కోతి చేష్టలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే కోతి నుంచే మనిషి రూపాంతరం చెందాడు అంటారు. అందుకే మనుషులు అప్పుడప్పుడు కోతి చేష్టలు చేస్తుంటారు. ఇక కోతులు కూడా ఒక్కోసారి అచ్చం మనుషుల్లాగే చేస్తుంటాయి. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోలో మనుషుల్లాగా కోతి నృత్యం చేయడం చూస్తారు. దీన్ని చూసిన నెటిజన్స్‌ నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

పర్వతాలపై సరదాగా గడుపుతున్న కొంతమంది అబ్బాయిలు ఒక కోతి నిశ్శబ్దంగా కూర్చోవడం చూశారు. కానీ దీని తర్వాత జరిగని సంఘటనే అందరినీ నవ్వించేలా ఉంది. వైరల్ వీడియో ప్రారంభంలో, ఒక కోతి పెద్ద బండరాయి పక్కన నిశ్శబ్దంగా కూర్చుని కనిపిస్తుంది. ఇంతలో, అక్కడ ఉన్న అబ్బాయిల గుంపు కోతిని చూసి బిగ్గరగా అరుస్తుంది. ఆ కోతిని చూస్తూ పెద్దగా శబ్ధ చేస్తూ డ్యాన్స్‌ చేయడం కనిపిస్తుంది.

అబ్బాయిలు డ్యాన్స్‌ చేయడం చూసిన తర్వాత కోతి కూడా తనను తాను నియంత్రించుకోలేకపోతుంది. కోతి కూడా ఆ బాయ్స్‌ బృందంతో కలిసి లయబద్ధంగా డ్యాన్స్‌ చేయడం ప్రారంభిస్తుంది. వీడియోలో, కోతి కూడా ఎంతో ఉత్సాహంగా బాయ్స్‌నున అనుకరిస్తూ ఒక రాతిపైకి దూకి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది.

వీడియో చూడండి:

ఈ ఆసక్తికరమైన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన తర్వాత, నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక యూజర్ ఫన్నీ టోన్‌లో వ్యాఖ్యానించాడు. కోతి కూడా ఏ జంతువులలో చిక్కుకుందో ఆలోచిస్తూ ఉండాలి అంటూ కామెంట్స్ పెట్టారు. డార్విన్ చెప్పింది పూర్తిగా నిజమే, మనుషులు కోతుల నుండి తయారయ్యారు అంటూ మరొక యూజర్‌ పోస్టు పెట్టారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *