పామును చూడడం ఏంటీ.. దాని పెరు వింటేనే మనం ఆమడ దూరం పరిగెడుతాం.. కొన్ని జంతువులు కూడా అంతే, పాములను చూస్తే భయపడుతూ ఉంటాయి. అలాంటి వీడియోలను ఇంతకుముందు మనం చూసి కూడా ఉంటాం. కానీ ఇక్కడో కోతి మాత్రం పూర్తిగా దానికి బిన్నంగా ప్రవర్తించింది. రోడ్డు పక్కన ఉన్న కోతికి ఒక పాము అడ్డొస్తే అది ఏమాత్రం బెదరలేదు, దాన్ని అమాంతం చేతితోకి తీసుకొని నెత్తిపై పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు షాక్ అవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రోడ్డుపై ఉన్న ఒక కొతి వద్దకు ఒక బ్లాక్ కోబ్రా వస్తుంది. ఆ పామును చూసిన కోతి మొదట పాము ముందు తల వంచి, ఆ తర్వాత దాన్ని అమాంతం చేతిలోకి తీసుకొని మెడలో వేసుకుంటుంది. అంతటితో ఆగకుండా దాన్ని తలపై పెట్టుకుంటుంది. దీంతో ఆ పాము దాని తలపై పాకడం ప్రారంభిస్తుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషమం ఏమిటంటే.. ఆ పాము కోతికి ఎలాంటి హాని తలపెట్టలేదు. అది కూడా కోతితో సరదాగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వీడియోను sachin_.244 అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోని ఇప్పటి వరకు వేలాది మంది చూసి లైక్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోపై తమ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో పంచుకున్నారు.
కోతి, పాముకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.