నేపాల్‌లోని ఖాట్మండు ప్రాంతంలో చైనా రాయబార కార్యాలయం అధికారులను తీసుకెళ్తున్న వాహనం కాలువలో పడిపోయింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగింది. ఈ సంఘటన మొత్తాన్ని స్థానికులు తమ కెమెరాలో రికార్డ్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఖాట్మండులోని ముల్పానీ క్రికెట్ గ్రౌండ్ సమీపంలోని కాగేశ్వరి మనోహర మునిసిపాలిటీ-6లో కారు రోడ్డు నుండి కాలువలోకి పడిపోయింది. కారులో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వారిని స్థానికులు రక్షించినట్లు వీడియోలో చూడవచ్చు.
సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన వైరల్ వీడియో, కారు కాలువలో చిక్కుకుపోయిందని, అందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు దాని నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాడని చూపిస్తుంది. స్థానికులు మరియు పోలీసులు వారికి సహాయం చేయడం చూడవచ్చు.
వీడియో చూడండి:
Chinese Embassy car falls in a drain in Nepal pic.twitter.com/wyFfdjb2F0
— Kreately.in (@KreatelyMedia) August 4, 2025
డిప్లొమాటిక్ ప్లేట్ 11 CD 619 ఉన్న కారులో ఇద్దరు చైనా జాతీయులు ఉన్నారు. ఆ కారు మురుగునీటి కాలువలో పడిపోయింది. సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు సహాయంతో పోలీసులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అని సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.