కుక్కలు విశ్వాసానికి మారు పేరు అని అందరికి తెలిసిందే. ఆకలితో ఉన్న కుక్కకు ఓ ముద్ద అన్నం పెడితే చచ్చే వరకు విశ్వాసంగా ఉంటుంది. ఇక పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కుక్కలు పెద్దవారితో కంటే చిన్న పిల్లలతో సరదాగా గడుపుతాయి. పిల్లలు కూడా పెట్ డాగ్స్‌ను ఎంతో అపురూపంగా ఓ ఆట బొమ్మలా చూసుకుంటారు. తాజాగా అలాంటి వీడియోను ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ చిన్న పిల్లవాడు పెంపుడు కుక్కతో గార్డెన్‌లో ఆడుకుంటున్న ఈ వీడియో నెటిజన్స్‌ను అకట్టుకుంటుంది. ఇందులో పిల్లవాడు ఆ కుక్కను తనకు తెలియకుండానే ఆటపట్టించిన తీరు సోషల్ మీడియా యూజర్స్‌ను ఫిదా చేస్తోంది.
వీడియో చూడండి:
Legend says they’re still looking for the ball.. 😂 pic.twitter.com/Vmx6gSjSS7
— Buitengebieden (@buitengebieden) August 5, 2025
ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్స్ అంతే ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. కూలింగ్ స్వెటర్‌తో పాటు తలకు కుల్ల ధరించిన బాలుడు ఓ చేత రబ్బర్ స్టిక్ మరో చేత బాల్ పట్టుకున్న గ్రౌండ్‌లో ఉన్నాడు. బాలుడితో పాటు పెంపుడు కుక్క కూడా గ్రౌండ్‌లో ఉంది. బాలుడు బంతి విసరగానే ఆ కుక్క బంతిని తీసుకొచ్చి పిల్లవానికి ఇచ్చే ఆట. అంతకు ముందు ఇలానే తెచ్చినట్లు వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఇక్కడే అసలు మజా జరిగింది.
బాలుడు బంతిని విసరే టైమ్‌లో అది బాలుడి వీపుపై స్వెటర్‌లో చిక్కుకుంటుంది. ఇప్పుడు ఆ కుక్క రియాక్షన్ చేసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు. బాలుడి చేతిలో బంతి లేదు. గార్డెన్‌లోనూ కనిపిస్త లేదు.. బంతి ఎక్కడ పోయిందని కుక్క తెగ పరేషాన్ అవుతుంటుంది. ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్స్ అంతే ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.