Viral Video: బజ్జీలు వేడిగా ఉన్నాయని లాగించేస్తన్నారా.. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి!

Viral Video: బజ్జీలు వేడిగా ఉన్నాయని లాగించేస్తన్నారా.. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి!


స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారు. ఆఫీస్‌లో బ్రెక్‌ టైం దొరికిందంటే చాలు.. పక్కనే ఉన్న కొట్టు దగ్గరకు వెళ్లి ఏదో ఒకటి కడుపులో వేస్తుంటారు.
కానీ వ్యాపారులు ఆ తినుబండారాలను ఎలా తయారు చేస్తున్నారన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరూ.. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోను చూస్తే.. మరోసారి ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ నాకొద్దు బాబోయ్‌ అంటారు. ఎందుకంటే ఆ వ్యాపారి బ్రెడ్‌ బజ్జీలు చేస్తూ.. నూనె ప్యాకెట్‌ను కట్‌చేసి వేయకుండా ఏకంగా వాటిని వేడి నూనెలో ముంచాడు. ఆ తర్వాత ఆదే నూనెతోనే పకోడీలు తయారు చేసి అక్కడున్న స్థానికులకు ఇచ్చారు. ఈ ఘటన లుథియానాలో చోటుచేసుకుంది

అక్కడే బజ్జీలు తినేందుకు వచ్చిన ఒక వ్యక్తి ఆ వ్యాపారి నూనె ప్యాకెట్‌లను వేడి అయిల్‌లో ముంచుతున్న దృశ్యాలను రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూడిన నెటిజన్లు ఆ బజ్జీలు మాకొద్దు రా సామి అంటున్నారు. మరోవైపు స్ట్రీట్‌ ఫుడ్‌ తినాలంటేనే భయపడుతున్నారు. అతను వాడే అయిల్‌ ఇప్పటికే కల్తీ అయి ఉంటుందంటే.. దానిలో మళ్లీ నూనె ప్యాకెట్స్‌ను ముంచి మరింత కల్తీ చేస్తున్నాడని మండిపడుతున్నారు.

ఇలాంటి నాణ్యత లేని ఫుడ్‌ తయారు చేసి జనాల ప్రాణాలతో చెలగాటమాడడం ఏంటని ఆ వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేసుకుంటున్నారు. కానీ ఆ వ్యాపారి మాత్రం త‌న చ‌ర్యను స‌మ‌ర్థించుకుంటున్నారు. వేడి నూనెలో ఆయిల్ ప్యాకెట్ తొందరగా ఒపెన్ అవుతుందని చెబుతున్నాడు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *