క్రికెట్ ప్రపంచంలో చాలా వింత సంఘటనలు జరుగుతుంటాయి. కానీ, ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక దృశ్యం కనిపించింది. ఇది సూపర్ ఓవర్ లేదా రికార్డు బద్దలు కొట్టే ఇన్నింగ్స్ లాంటిది కాదు.. కానీ, అంతకు మించిన విచిత్ర సంఘటన ఇది. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఒక నక్క మైదానం మధ్యలోకి పరిగెత్తింది. అంత పెద్ద క్రికెట్ గ్రౌండ్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన ఆ నక్క అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో మ్యాచ్ కొంతసేపు ఆగిపోయింది. నక్క బయటకు వెళ్లిన తర్వాత మళ్ళీ ఆట ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
మంగళవారం లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఎవరూ ఊహించని షాకింగ్ దృశ్యం కనిపించింది. మెన్స్ హండ్రెడ్ టోర్నమెంట్‌లో ఆగస్టు 5న లార్డ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు 6 వికెట్ల తేడాతో లండన్ స్పిరిట్‌ను ఓడించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో ఒక నక్క మైదానంలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించింది. అది ఫీల్డ్‌లో పరుగులు పెడుతూ కాసేపు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సమయంలో మ్యాచ్‌కు కొంత సేపు అంతరాయం కలిగింది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి…
There’s a fox on the field! 🦊 pic.twitter.com/3FiM2W90yZ
— Sky Sports Cricket (@SkyCricket) August 5, 2025
ఇన్విన్సిబుల్స్ 81 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ప్రారంభించగానే ఈ వింత అంతరాయం ఏర్పడింది. గ్రౌండ్‌లోకి ప్రవేశించిన నక్క అవుట్ ఫీల్డ్ అంతటా పరుగెత్తింది. ప్రేక్షకులు, వ్యాఖ్యాతలు, ఆటగాళ్ల నుండి ఫన్నీ రియాక్షన్స్ వచ్చాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ దీనిని ఫాక్స్ స్టాప్ ప్లే మూవ్‌మెంట్ అంటూ పిలుస్తున్నారు. అనూహ్యమైన క్రికెట్ ప్రపంచంలో కూడా ఇది అరుదైన సంఘటనగా నెటిజన్లు పేర్కొంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…