Viral Video: నీటిలో తేలియాడుతూ కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్.!

Viral Video: నీటిలో తేలియాడుతూ కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్.!


సముద్రం ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంటుంది. ఈ విశాల ప్రపంచానికి అంతుచిక్కని అనేక వింత జీవులు సంద్రంలో దాగుంటే.. వాటిల్లో కొన్ని మాత్రమే ఒడ్డుకు వస్తుంటాయి. ఇదిలా ఉంటే.. ఓ జీవిని సముద్రపు అలెగ్జాండర్ అని పిలుస్తుంటారు. మీకు ఈపాటికి అర్ధమై ఉంటుంది.! అదేనండీ.. మొసలి.. నీటిలో వెయ్యి ఏనుగుల బలం మొసలి సొంతం. ఎంతటి భారీ జంతువు నీటిలోకి వచ్చినా.. మొసలి నమిలి తినేస్తుంది. మరి అలాంటి మొసలి.. అదీనూ అత్యంత భారీ సైజులో మనకు దగ్గరలో కనిపిస్తే.. దెబ్బకు షాక్ అయిపోతాం. మరి అలాంటి ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

సాధారణంగా విదేశాల్లో వీకెండ్ వస్తే చాలు.. దగ్గరలో ఉన్న సరస్సులోకి చేపల వేటకు వెళ్తుంటారు. అలాగే ఓ వ్యక్తి కూడా తన దగ్గరున్న బొట్ వేసుకుని ఓ సరస్సులోకి వెళ్లారు. చేపలు పట్టేందుకు అనువైన చోటు కోసం వెతుకుతుండగా.. చెట్టుల చాటున ఓ భారీ ఆకారం.. ఈదుకుంటూ నీటిలోకి వెళ్తోంది. దాన్ని చూడగానే ఆ వ్యక్తి దెబ్బకు షాక్ అయ్యాడు. అమ్మబాబోయ్.! ఇక ఇక్కడ ఉండటం కష్టం గురూ..! అంటూ పడవను తిప్పేశారు. ఇంతకీ ఆ నల్లటి ఆకారం ఏంటని ఆలోచిస్తున్నారా.! సాల్ట్‌వాటర్ క్రోకడైల్.. ఈ ఉప్పునీటి మొసళ్లు ఎప్పుడూ సముద్రాలు, సరస్సులు లాంటి వాటిల్లో ఉంటాయి.

భారతదేశపు తూర్పు తీరం నుంచి ఆగ్నేయాసియా, సుండాలాండ్ నుంచి ఉత్తర ఆస్ట్రేలియా, మైక్రోనేషియా వరకు ఉన్న మంచినీటి నదుల్లో ఇవి ఉంటాయి. వీటి బరువు వెయ్యి నుంచి 1500 కేజీల బరువు ఉండగా.. పొడవు 20 ఫీట్లు ఉంటుంది. లేట్ ఎందుకు ఆ వీడియో ఓసారి లుక్కేయండి.

ఇది చదవండి: పొట్ట బొండంలా ఉబ్బిపోయి ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. టెస్టులు చేయగా..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *