
టికెట్ తీసుకోకుండా ట్రైన్‌లో ప్రయాణించడమే కాకుండా.. టికెట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించిన అధికారులపై ఒక యువకుడు రెచ్చిపోయిన ఘటన ముంబైలోని బొరివలి రైల్వే స్టేషన్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితుడిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విరార్ ఫాస్ట్ లోకల్ రైలులో సెకండ్ క్లాస్ టికెట్‌పై ఫస్ట్ క్లాస్ కోచ్‌లో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు పట్టుబడ్డారు. వారిలో ఒక ప్రయాణికుడి వద్ద అంధేరి నుంచి బోరివలి వెళ్లాల్సిన టికెట్ లేదు.దీంతో వారిని నెక్ట్స్ వచ్చే బొరివలి స్టేషన్‌లో దింపి టీసీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ టటికెట్ ఎందుకు తీసుకోలేదని సదురు యువకుడిని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన యువకుడు సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా టికెట్ కౌంటర్‌లో ఉన్న కంప్యూటర్లు, కీబోర్డులును ధ్వంసం చేశాడు.
సదురు యువకుడి దాడిలో పలువురు అధికారులు గాయపడినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. ఎల్లో కలర్ కుర్తా ధరించిన ఒక యువకుడు అధికారులపై అరుస్తూ.. ఆఫీస్‌లోని కంప్యూటర్, కీబోర్డ్స్‌ను ధ్వంసం చేయడం మనం స్పష్టంగా చూడవచ్చు.
స్థానిక రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటన గురించి తెలుసుకున్న రైల్వే ప్రొలక్షన్ ఫోర్స్ నిందితులను అదుపులోకి తీసుకుని, గవర్నమెంట్ రైల్వే పోలీసులకు (జీఆర్పీ) అప్పగించారు. ఈ మేరకు అధికారుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో చూడండి..
@RPF_INDIA @rpfwr1 @rpfwrbct Today 02/08/25 at Borivali station, a ticketless passenger beat up the TT and broke government computers and other valuables When government employees are not safe then how will the railways ensure the safety of the common man? @RailMinIndia @Gmwrly pic.twitter.com/2D9lxJNZ43
— Sujeet Mishra (@Sujeetmishra07) August 2, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి