Viral Video: కోతిని వెంటాడుతూ చెట్టు ఎక్కిన పెద్ద పులి.. చివర్లో ట్విస్ట్ మీరు ఊహించలేరు.

Viral Video: కోతిని వెంటాడుతూ చెట్టు ఎక్కిన పెద్ద పులి.. చివర్లో ట్విస్ట్ మీరు ఊహించలేరు.


అడవిలో వేట అంటే అంత ఈజీ కాదండోయ్.. ఎంత పెద్ద క్రూర మృగాలు అయినా.. కొన్నిసార్లు బోల్తా పడిపోతుంటాయ్. వెంటాడి.. వేటాడే జీవులకు ఆ శక్తిని ఇచ్చిన ప్రకృతి.. బలయ్యే జీవులకు సైతం కొన్ని అనుకూలతను ఇచ్చింది. తాజాగా వీడియోనే అందుకు ఉదాహారణ. భారతదేశంలోని కార్బెట్ అటవీ ప్రాంతంలో ఒక అరుదైన వన్యప్రాణి సంఘటన చోటు చేసుకుంది. మంచి ఆకలి మీద ఉన్న పెద్ద పులి.. ఓ లంగూర్ కోతిని వెంటాడింది. దీంతో  ఆ కోతి చావు నుంచి తప్పించుకునేందుకు చెట్టు పైకి ఎక్కింది.  సాధారణంగా తమ బరువు దృష్ట్యా పెద్ద పులులు చెట్లు ఎక్కే ప్రయత్నం చేయవు. కానీ ఈ పులి మాత్రం.. ఆ కోతిని ఎలాగైనా ఆహారంగా చేసుకోవాలని భావించి చెట్టు ఎక్కింది. దీంతో కోతి.. తెలివిగా తమ బరువును మాత్రమే ఆపగలిగే చిటారు కొమ్మల్లోకి వెల్లింది. పులి దాన్ని అనుసరించి.. ఆ కొమ్మలు వద్దకు వెళ్లి పట్టు కోల్పోయి.. కింద పడింది. ఈ దృశ్యాలను పర్యాటకులు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది.

వీడియో దిగువన చూడండి… (Video Credit: Catersnews)



Also Read: ఈ ఆకులు నాటు కోళ్లకు వేసి చూడండి.. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు… 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *