Viral Video: ఎచ్చులకు పోతివి..ఎల్లెల్కల పడితివి..అవసరమా బ్రో… ఉత్తపుణ్యానికి బైక్‌ పాయె.. వైరల్‌ వీడియో

Viral Video: ఎచ్చులకు పోతివి..ఎల్లెల్కల పడితివి..అవసరమా బ్రో… ఉత్తపుణ్యానికి బైక్‌ పాయె.. వైరల్‌ వీడియో


సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు స్టంట్‌ మాస్ట్‌ అయిపోతున్నారు. ఎలాగైనా ఫేమస్‌ కావాలని ప్రమాదకరమైన స్టంట్‌ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాంటి వీడియోలు నెట్టింట అనేకం వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి తాజాగా చక్కర్లు కొడుతోంది. వరద నీటిలో మునిగిపోయిన వంతెన పై నుండి ఒక వ్యక్తి బైక్‌ను నడపడానికి ప్రయత్నించినప్పుడు షాకింగ్‌ ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

రుతుపవనాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో.. అప్రమత్తంగా లేకుంటే అంతకు మంచి ప్రమాదకరంగా మారతాయి. ఒక వైపు పచ్చదనం, చల్లని గాలులు ఉపశమనం ఇస్తుండగా, మరోవైపు భారీ వర్షం కూడా చాలాసార్లు విధ్వంసానికి కారణమవుతుంది. వర్షాకాలంలో వాగులు వంకలు పొంగొ పొర్లుతుంటాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు వంతెనలపై నుండి నీరు ప్రవహిస్తుంది. ఆ సమయంలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతుంటాయి. అయితే అత్యవసర పరిస్తితుల్లో ప్రజలు రిస్క్ తీసుకొని అలాంటి మునిగిపోయిన వంతెనలను దాటడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ వీడియోను చూడండి, దీనిలో ఆ వ్యక్తి ఫిల్మ్ రీల్ తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ, అక్కడ జరిగిన సీన్‌తో అతడికి కళ్లు బైర్లు కమ్మాయి.

వీడియో చూడండి:

వీడియోలో, ఒక వ్యక్తి తన బైక్ తో వంతెనను దాటడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు, అది వర్షం కారణంగా పూర్తిగా మునిగిపోయింది. ప్రమాదాన్ని నివారించడానికి, మొదట అతను బైక్ ను వంతెన పక్కన ఆపి, అతని స్నేహితుడు అక్కడ తాడును పైకి లేపుతాడు. దీని తరువాత, బైక్ రైడర్ తన బైక్ ను నీటితో నిండిన వంతెనపై నేరుగా నడుపుతాడు. ఆ వ్యక్తి వంతెనను దాటడం లేదు, కానీ ఫిల్మ్ స్టంట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అకస్మాత్తుగా బలమైన ప్రవాహం కారణంగా, బైక్ అకస్మాత్తుగా జారిపడి నీటితో ప్రవహించే వంతెన నుండి కిందకు పడిపోయింది.

ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *