
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక వింత సంఘటన వెలుగు చూసింది. ఓ ఇద్దరు దొంగలు రాత్రి వేళలో దొంగతనానికి వచ్చారు. దొంగతనానికి వచ్చిన ఆ ఇద్దరు.. డ్రెయిన్‌పై కప్పి ఉంచిన ఇనుప మూతను ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం తతంగం అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు కావడంతో.. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోను తీక్షణంగా చూస్తే.. ఇద్దరు వ్యక్తులు డ్రెయిన్ మూతను ఎత్తుతున్నట్టు మీరు చూడవచ్చు. ఇక ఇంతలో మరొక వ్యక్తి ఈ-రిక్షాలో వచ్చి.. ఆ ఇద్దరు దొంగలకు సాయం చేశాడు. ఇద్దరు దొంగలు ఇనుప మూతను రిక్షాలో ఎక్కించగా.. అక్కడి నుంచి ముగ్గురు దెబ్బకు పరార్ అయ్యారు. ఆగష్టు 2న అర్ధరాత్రి వేళ స్థానిక గ్యాస్ ఏజెన్సీ సమీపంలోని లాల్ కువాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..