ఈ రోజుల్లో దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో నిరంతర భారీ వర్షాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. రోడ్ల పరిస్థితి చిన్న చెరువులుగా మారిపోయింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు నడవడం కష్టంగా మారింది. ఇలాంటి వర్షాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలంలో ప్రమాదాలు సంభవించే సమయంలో ఇలాంటి ఎక్‌స్టాలు మానుకుంటే మంచిదంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకి ఈ వీడియో సంగతేంటో చూద్దాం.
ఇది కూడా చదవండి: త్వరపడండి.. 28 రోజుల వ్యాలిడిటీతో రూ.189 ప్లాన్..బెనిఫిట్స్ ఇవే
ఇవి కూడా చదవండి
వర్షాకాలంలో రోడ్లన్నీ కూడా చెరువుల్లా తలపిస్తుంటాయి. అలాంటి సమయంలో బైక్‌పై వెళ్తుంటే కిందకి దిగి బైక్‌ను నెట్టుకుంటూ వెళ్లడం చాలా మందిని చూస్తుంటాము. అలాగే బైక్‌పై కూర్చుని వెళ్లడం చూస్తుంటాము. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళ చేసిన పొరపాటుకు నీటిలో పడిపోయే పరిస్థితి ఎదురైంది. ఒక అమ్మాయి స్కూటీపై నీటిలో చిక్కుకుపోయింది. తన మొండితనం కారణంగా అకస్మాత్తుగా కిందపడిపోవడంతో ప్రమాదంలో పడిపోయింది.
ఇది కూడా చదవండి: Jio Plan: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. రూ.51లకే 5G డేటా.. నెలరోజుల వ్యాలిడిటీ!
ఈ వైరల్ వీడియోలో వర్షపు నీటితో నిండిన రోడ్డుపై ఒక అబ్బాయి, అమ్మాయి కనిపిస్తున్నారు. వారి స్కూటీ నీటిలో చిక్కుకుపోయింది. ఆ అబ్బాయి స్కూటీని బయటకు తీయడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అది అస్సలు కదలలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి మొత్తం స్కూటీపైనే కూర్చుంటుంది. స్కూటీ కదల్లేకి చివరకు బ్యాలెన్స్ ఆగలేక కిందపడిపోయింది. దీంతో స్కూటీపై కూర్చాన్న అమ్మాయి కూడా నీటితో పడిపోయింది. ఆ అమ్మాయి ముందే స్కూటీ దిగి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగేది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి మీరు కూడా ఈ వీడియో చూసి ఏమంటారో చెప్పండి.
ఇది కూడా చదవండి: Post Office: పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. రూ.12,500 డిపాజిట్‌తో రూ.70 లక్షలు.. ఎలా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి