Bizarre News: అడవిలో బలమైన జంతువుదే ఆధిపత్యం. ఎలాంటి పరిస్థితిలోనూ తనను తాను రక్షించుకోగలిగిన జంతువు మాత్రమే మనుగడ సాగిస్తుంది. అడవి జంతువుల మధ్య పోరాటాలు ఎన్నో సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని నెటిజన్లకు బాగా నచ్చుతుంటాయి. తాజాగా మరో వైరల్ వీడియో కూడా ఈ లిస్ట్‌లో చేరింది. ఇందులో ఒక కొండచిలువ తనను తాను రక్షించుకోవడానికి పులితో పోరాడింది. కానీ, పులి ముందు పిచ్చి వేశాలు వేస్తే ఎలాంటి వారికైనా ఎలాంటి పరస్థితి ఎదురవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కొండచిలువ శక్తివంతమైనది. కానీ, దాని బరువైన శరీరం కారణంగా అది వేగంగా పరిగెత్తలేదు. అయితే పులి చురుకైన జంతువు. ఈ వీడియోలో కొండచిలువ గడ్డిలో దాక్కుని ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అకస్మాత్తుగా ఒక పులి దానిపై దాడి చేస్తుంది.
ఇవి కూడా చదవండి
టైగర్, కొండ చిలువ పోరాటం..!
ఆ కొండచిలువ ఒకసారి పులిపైకి దూసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ, పులి దాని పదునైన దంతాలతో కొండ చిలువను గట్టిగా పట్టుకుంటుంది. ఆ తరువాత, కొండచిలువ పరిస్థితి తెలిసిందే. పులి దానిని తన దవడలలో పట్టుకుని చంపేస్తుంది. ఈ క్లిప్‌ను @pranaypatel అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు దీనిని 9.5 లక్షలకు పైగా వీక్షించారు. 42 వేలకు పైగా ప్రజలు దీన్ని లైక్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..