ఆహారం, నిద్ర.. మనిషి జీవితంలో ఈ రెండు కీలక పాత్ర పోషిస్తాయి. సరైన సమయంలో సరిగ్గా ఆహరం తీసుకుంటే.. మనం ఆరోజు యాక్టివ్‌గా పని చేయగలం. అలాగే నిద్ర కూడా మన జీవితంలో కీ రోల్ పోషిస్తుంది. ప్రతీ ఒక్కరికీ రోజుకు ఎనిమిది గంటల నిద్ర చాలా ముఖ్యం. లేదంటే.. ఆ రోజు చుక్కలు చూసినట్టే. మరి మన జీవితంలో ఇంతటి కీలకంగా మారిన నిద్ర గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీకు తెల్సా.? మనం నిద్రపోయే భంగిమ బట్టి.. మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయొచ్చునట. అదేంటి.? నిజమా అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండీ పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాధారణంగా ప్రతీ ఒక్కరూ ఒకే భంగిమలో నిద్రపోరు. కొందరు వెల్లకిల్లా పడుకుంటే.. మరికొందరు బోర్లా పడుకుంటారు. ఇంకొందరు ఎడమవైపునకు.. అలాగే కుడివైపునకు.. కాళ్లు ముడుచుకుని.. ఇలా అందరికీ ఒక్కో నిద్ర భంగిమ ఉంటుంది. మరి అవి ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
పక్కకు తిరిగి కాళ్లు ముడుచుకుని పడుకుంటే..
ఈ భంగిమలో నిద్రపోయేవారు చాలా సెన్సిటివ్. చిన్న విషయాలకే బాధపడిపోతారు. అలాగే తెగ కష్టపడతారు. ఇక వీరిలో అసంతృప్తి ఎక్కువ. ఎంత మంచి జరిగినా.. ఎప్పుడూ ఏదో వెలితితో ఉంటారు. ఇక కుడిచేతిని తలకింద పెట్టుకుని.. కుడివైపునకు పడుకునేవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏదైనా పని చేయాలని తలుచుకుంటే కచ్చితంగా విజయం సాధించేవరకు విడిచిపెట్టరు. డిఫరెంట్ ఆలోచనలు వీరి సొంతం. లీడర్‌షిప్, డబ్బు ఎప్పుడూ వీరితోనే ఉంటాయి. మరోవైపు ఎడమ చెయ్యి తలకింద పెట్టుకుని.. ఎడమవైపునకు తిరిగి పడుకునేవారిలో మంచి గుణాలు ఎక్కువ. పెద్దలను గౌరవిస్తారు. పనిలో నిబద్దత ఉంటుంది. ఆత్మవిశ్వాసం వీరిలో తక్కువ ఉన్నప్పటికీ.. క్రియేటివిటీకి రారాజులు.
వెల్లకల్లా, బోర్లా పడుకునేవారు..
వెల్లకల్లా పడుకునేవారు ఫ్రీ బర్డ్స్. అందరిలోనూ తాను ఉండాలని.. అదికూడా ప్రత్యేక గుర్తింపు పొందాలని తహతహలాడతారు. ఇక బోర్లా పడుకునేవారు సంకుచిత స్వభావం కలిగి ఉంటారు. అంటే వారు ఎంచుకున్న పరిధి మేరకు మాత్రమే ఆలోచిస్తారు. అంతకుమించి ముందుకు వెళ్లరు. ఇతరులతో ఏది కూడా డిస్కస్ చేసుకోరు. ప్రతీ పనిలోనూ అలసత్వం, ఏ లక్ష్యం నిర్దేశిన్చుకోకపోవడం లాంటివి వీరి సొంతం. ఒకవైపునకు తిరిగి రెండు కాళ్లు ముడుచుకుని పడుకునేవారు స్వార్ధపరులట. వీరిలో అసూయ, పగ, ప్రతీకారాలు ఎక్కువ. వీరు ప్రతి పనిని చూసి భయపడతారు. దూరంగా ఉంటారు. త్వరగా ఇతరుల దగ్గర మోసపోతారు.
ఇది చదవండి: పొట్ట బొండంలా ఉబ్బిపోయి ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. టెస్టులు చేయగా..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..