Viral: కూర వండేందుకు చేపను కోస్తున్న మహిళ.. దాని కడుపులో కనిపించింది చూసి అవాక్కు

Viral: కూర వండేందుకు చేపను కోస్తున్న మహిళ.. దాని కడుపులో కనిపించింది చూసి అవాక్కు


కేరళ అలప్పుజ జిల్లాలోని చారుమ్మూడ్‌కు చెందిన సనోజ్‌కి చిన్నప్పటి నుంచే చేపల వేటంటే ఇష్టం. పెద్దవాడై పెళ్లైనా సరే ఆ వేటే అతనికి కాలక్షేపం. వర్షాకాలంలో మడుగులు, వాగుల వద్దకు వెళ్లి చేపలు పట్టేవాడు. శనివారం కూడా సాయంత్రం పనులన్నీ ముగించుకుని, ఇంటి పక్కనే ఉన్న పొలం సమీపంలోని ఓ మడుగులో గాలం వేసాడు. ఎక్కువసేపు వేచి చూడకముందే గాలం కదిలింది. లాగేసరికి దాదాపు 900 గ్రాముల బరువున్న ముర్రెల చేప(varal fish) చిక్కింది. ఇది కూరకి సరిపోతుంది అనుకుంటూ ఆనందంగా ఇంటికి వచ్చాడు. సాయంత్రం వంటకి సిద్దమవుతున్న సనోజ్ భార్య.. ఆ చేపను శుభ్రం చేయడం మొదలుపెట్టింది. కత్తితో కోస్తుండగా.. కడుపులో ఏదో పాము మాదిరి చర్మం కనిపించింది. ఏంటోనని కడుపు చీల్చి చూస్తే… లోపల రెండు అడుగుల పొడవున్న నాగుపామును గుర్తించారు.

దాన్ని బయటకి తీసి జాగ్రత్తగా చూసేసరికి… పాము చర్మం ఇప్పటికే కుళ్లిపోతున్న స్థితిలో ఉంది. కానీ తల భాగం మాత్రం దాదాపు అలాగే ఉంది. తలపై ఉన్న ప్రత్యేకమైన చారలు చూసి.. అది నాగుపామేనని కుటుంబ సభ్యులు ఖచ్చితంగా గుర్తించారు. ఈ దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ చేప తిన్నామంటే ఏమయ్యేదో అనుకుంటూ గబగబా చేతులు కడిగేశారు. సనోజ్.. చేపతో పాటు ఆ పామును కూడా ఒక గుంత తీసి పాతిపెట్టాడు. గ్రామంలో ఈ విషయం గురించి తెగ చర్చించుకున్నారు. చేప కడుపులో నాగుపామా అంటూ ఆశ్చర్యపోయారు. కొందరు జాలర్లు మాత్రం ముర్రెల చేపలు చిన్న పాములను తినేస్తాయని.. కాని ఈ సైజ్ నాగు పామును తినడం తొలిసారి చూస్తున్నామన్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *