Vijay sethupathi: కటౌట్ అద్దిరిపోయింది.. హీరోగా విజయ్ సేతుపతి కుమారుడి ఎంట్రీ.. ట్రైలర్ ఇదిగో

Vijay sethupathi: కటౌట్ అద్దిరిపోయింది.. హీరోగా విజయ్ సేతుపతి కుమారుడి ఎంట్రీ.. ట్రైలర్ ఇదిగో


సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన నటుల్లో విజయ్ సేతుపతి కూడా ఒకడు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన అతను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గానూ అదరగొడుతున్నాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ జనాలను కూడా ఆకట్టుకున్నాడీ వర్సటైల్ యాక్టర్. ఇక మహారాజా సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన సేతుపతి ఇటీవలే ఏస్ సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు. అయితే ఇప్పుడు విజయ్ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ అతని కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సూర్య సేతుపతి మొదటి సినిమా ఫీనిక్స్. స్టంట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏకే బ్రేవ్‌మ్యాన్‌ పిక్చర్స్‌ నిర్మించారు. అభిన‌క్ష‌త్ర‌, వ‌ర్ష హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా… వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, సంప‌త్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

కాగా గతంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన నానుమ్‌ రౌడీదాన్, సిందుబాద్‌’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించాడు సూర్య సేతుపతి. ఇప్పుడు హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే ఫీనిక్స్ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పవర్‌ఫుల్‌ యాక్షన్, చక్కని ఎమోషన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక సూర్య సేతుపతి కటౌట్ కూడా అద్దిరిపోయింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఫీనిక్స్ సినిమా జూలై 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

సూర్య సేతుపతి ఫీనిక్స్ ట్రైలర్ ఇదిగో..



మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *