Vijay- Rashmika: విజయ్-రష్మిక వెడ్డింగ్‌లో ఊహించని ట్విస్ట్.. భారీ ఆఫర్‌ను తిరస్కరించిన రౌడీ బాయ్!

Vijay- Rashmika: విజయ్-రష్మిక వెడ్డింగ్‌లో ఊహించని ట్విస్ట్.. భారీ ఆఫర్‌ను తిరస్కరించిన రౌడీ బాయ్!


Vijay- Rashmika: విజయ్-రష్మిక వెడ్డింగ్‌లో ఊహించని ట్విస్ట్.. భారీ ఆఫర్‌ను తిరస్కరించిన రౌడీ బాయ్!

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్త ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. ఆన్‌స్క్రీన్‌పై తమ కెమిస్ట్రీతో మ్యాజిక్ చేసిన ఈ జంట.. త్వరలోనే రియల్ లైఫ్‌లో ఒక్కటి కాబోతున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీళ్ళ వివాహం అత్యంత వైభవంగా జరగనుందని తెలుస్తుంది. ఓ వైపు తమ తమ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే.. మరోవైపు పెళ్లి పనులను కూడా చకచకా చక్కబెడుతున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగబోయే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఉదయ్‌పూర్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో సెలబ్రిటీల పెళ్లిళ్లు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాదు, కోట్లు కురిపించే బిజినెస్ వ్యవహారాలుగా కూడా మారిపోయాయి. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హవా పెరిగాక.. స్టార్స్ పెళ్లి వీడియోల స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.

గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్‌ల పెళ్లి వీడియో హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు 25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో కూడా సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వంటి జంటల పెళ్లిళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఊపందుకుంది. విజయ్ దేవరకొండ, రష్మికలకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ దృష్ట్యా.. వీళ్ళ పెళ్లి వీడియో హక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నయనతార పెళ్లికి ఇచ్చిన దానికంటే డబుల్, అంటే దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా ఆఫర్ చేసిందని.. ఈ వెడ్డింగ్ వీడియోను ఒక డాక్యుమెంటరీ తరహాలో షూట్ చేసి, స్ట్రీమింగ్ చేస్తే రికార్డు స్థాయి వ్యూస్ వస్తాయని సదరు సంస్థ భావించింది.

ఇంత భారీ మొత్తం ఆఫర్ వస్తే ఎవరైనా సరే ఆలోచనలో పడతారు.. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడే మన రౌడీ బాయ్ తన ఆటిట్యూడ్ చూపించారు. తన వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా పెళ్లి లాంటి పవిత్రమైన ఘట్టాన్ని వ్యాపారం చేసుకోవడం ఇష్టం లేక.. ఆ భారీ ఆఫర్‌ను చాలా సున్నితంగా తిరస్కరించారని తెలుస్తుంది. పెళ్లి అనేది పూర్తిగా తన ప్రైవేట్ స్పేస్ అని, ఆ తీపి జ్ఞాపకాలను కేవలం తమ కుటుంబం, సన్నిహితుల మధ్యే ఉంచుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. కెమెరాల హడావిడి, లైవ్ టెలికాస్ట్‌ల ఆర్భాటం లేకుండా.. సాంప్రదాయబద్ధంగా, ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలన్నదే విజయ్, రష్మికల ఉద్దేశంగా కనిపిస్తుంది. పైగా ఓటిటి సంస్థ ఎంటర్ అయితే ఆ తర్వాత పెళ్లిలో వాళ్లు చేసే అతి కూడా భరించాల్సిందే.

ఓటిటి వాళ్లు ఎంటర్ అయిన తర్వాత పర్సనల్ స్పేస్ మాత్రమే కాదు.. ప్రైవేట్ టైమ్ కూడా ఉండదు. అందుకే విజయ్ దేవరకొండ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. రౌడీ బాయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానుల్లో అతనిపై గౌరవం మరింత పెరిగింది. కోట్లు ముఖ్యం కాదు.. బంధాలు, ప్రైవసీనే ముఖ్యమని విజయ్ నిరూపించాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కాకపోయినా, వీళ్ళ పెళ్లి వేడుక మాత్రం అంగరంగ వైభవంగా జరగబోతోంది. పెళ్లి తర్వాత ఈ జంట తమ అభిమానుల కోసం అధికారికంగా ఫోటోలను విడుదల చేసే అవకాశం ఉంది. ఏదేమైనా రీల్ లైఫ్ గీత గోవిందం జంట.. రియల్ లైఫ్‌లోనూ ఒక్కటవుతుండటంతో అటు రష్మిక ఫ్యాన్స్, ఇటు విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 26న జరగబోయే ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *