Vijay-Rashmika: విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! ఈ లవ్ బర్డ్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

Vijay-Rashmika: విజయ్ దేవరకొండ-రష్మికల పెళ్లి ! ఈ లవ్ బర్డ్స్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?


తెలుగు సినిమాల్లో బాగా హిట్ అయిన జోడీల్లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల జోడీ ఒకటి. 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ గీత గోవిందం సినిమాలో వీరి కెమిస్ట్రీ అద్దిరిపోయింది. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ సినిమాలోనూ ఈ జోడీకి మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమ షూటింగుల్లోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. రీల్ లైఫ్ లో ప్రేమికులుగా నటించి మెప్పించిన ఈ జోడీ నిజ జీవితంలోనూ ప్రేమికులుగా మారారు. ఇప్పుడు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారు. ఇరు పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కుతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ లోని చారిత్రక ప్యాలెస్ వేదికగా ఒక్కటి కాబోతున్నారు విజయ దేవరకొండ- రష్మిక మందన్నా. అయితే తమ పెళ్లి వార్తల గురించి సోషల్ మీడియా కోడై కూస్తున్నప్పటికీ దీనిపై ఇంకా ఈ జంట స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఎంగేజ్మెంట్ లాగానే పెళ్లి వేడుకకు సంబంధించి కూడా రష్మక- విజయ్ ఎంతో గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ గ్రాండ్ వెడ్డింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల మధ్య ఏజ్ గ్యాప్ గురించి నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది

కాగా విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించారు. ప్రస్తుతం అతని వయసు సుమారు 36 సంవత్సరాలు. మరో వైపు రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంటే ఈ బ్యూటీ వయసు సుమారు 30 సంవత్సరాలు. అలా ఇద్దరి డేట్ అఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే వీరి ఇద్దరి మధ్య సుమారుగా ఏడు సంవత్సరాల వయసు గ్యాప్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వయసు తేడాలు చాలా సర్వసాధారణమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే విజయ్ దేవర కొండ-రష్మిక మందన్నాల పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే మార్చ్ 4న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు విజయ్-రష్మిక. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *