Video: సెలెక్టర్లు ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో టీమిండియా బౌలర్ బీభత్సం..

Video: సెలెక్టర్లు ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో టీమిండియా బౌలర్ బీభత్సం..


Mohammed Shami 32 Ball Fifty: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం టీమిండియాకు దూరంగా ఉన్నాడు. చివరిసారిగా గత సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరపున ఆడాడు. ఈ మధ్యలో ఫాంలో లేకపోవడం, గాయాల పాలవ్వడంతో సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఫిట్ నెస్ సాధించినా.. అగార్కర్ తో జరిగిన గొడవలతో భారత జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తాజాగా ఈ సీనియర్ పేసర్ తన సత్తా చాటి టీమిండియా సెలక్టర్లకు ఇచ్చి పడేశాడు. కేవలం 32 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, బౌలింగ్ లోనే కాదు.. బ్యాటింగ్ లోనూ తన పవర్ తగ్గలేదని చూపించాడు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ తరపున షమీ ఈ ఘనత సాధించాడు.

బంతితోపాటు బ్యాట్‌తోనూ మ్యాజిక్ చేస్తోన్న షమీ..

రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో 4వ రోజు ఆకాష్ దీప్ ఔటైన తర్వాత 192వ ఓవర్‌లో మహ్మద్ షమీ బ్యాటింగ్‌కు దిగాడు. షమీ రెండో బంతికి ఒక ఫోర్ కొట్టాడు. తన మొదటి 10 బంతుల్లో ఒకే ఒక ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత షమీ షేక్ రషీద్, త్రిపుర్ణ విజయ్‌ బౌలింగ్ లో విరుచపడ్డాడు. తరువాతి 10 బంతుల్లో ఏడు ఫోర్లు కొట్టాడు. సౌరభ్ కుమార్ బౌలింగ్‌లో షమీ ఒక సిక్స్‌తో తన యాభై పరుగులు పూర్తి చేశాడు. చివరికి 200వ ఓవర్‌లో అతను 33 బంతుల్లో 53 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాదాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: IND vs NED: నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్.. ఎవరంటే..?

షమీ గతంలో రెండు ఫస్ట్ క్లాస్ అర్ధ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. 2021లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై 70 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 2014లో ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌పై అతని రెండవ అర్ధ సెంచరీ వచ్చింది.

మ్యాచ్ గురించి మాట్లాడితే, బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ టాస్ గెలిచి ఆంధ్రను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆంధ్ర టీం 295 పరుగులు చేసింది. రికీ భూయ్ 83 పరుగులు చేశాడు.  బెంగాల్ తరపున ముఖేష్ కుమార్ 5 వికెట్లు పడగొట్టాడు. అయితే, రెండవ ఇన్నింగ్స్‌లో బెంగాల్ 43 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత, సుదీప్ ఘరామి 299 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 600 దాటింది. సుదీప్ షాబాజ్ అహ్మద్, సుమంత గుప్తాతో కలిసి కీలక భాగస్వామ్యాలు ఏర్పరచాడు.

ఇది కూడా చదవండి: T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్.. టాప్ 10లో ఒక్కరు కూడా లేరుగా..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *