Video: షేక్ హ్యాండ్ కోసం ఆశగా ఎదురుచూసిన పాక్ ఆటగాళ్లు.. మైదానం వీడకుండా ఏం చేశారంటే?

Video: షేక్ హ్యాండ్ కోసం ఆశగా ఎదురుచూసిన పాక్ ఆటగాళ్లు.. మైదానం వీడకుండా ఏం చేశారంటే?


Shaheen Afridi and Usman Tariq Waiting Handshake: ఆదివారం జరిగిన భారత్ vs పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో మరోసారి ‘నో షేక్ హ్యాండ్’ (No Handshake) విధానం కొనసాగింది. ఆసియా కప్ 2025 సమయంలో సూర్యకుమార్ యాదవ్ అండ్ కో తీసుకున్న నిర్ణయమే ఇక్కడ కూడా అమలైంది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో చేతులు కలపలేదు. గతేడాది దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ నుంచే ఇదే విధానం కొనసాగుతోంది. “నో షేక్ హ్యాండ్ విధానం కొనసాగుతూనే ఉంటుంది” అని మ్యాచ్‌కు గంట ముందు కొలంబోలో బీసీసీఐ (BCCI) అధికారి పీటీఐకి తెలిపారు.

మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా రెండు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పరస్పరం చేతులు కలపలేదు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల పట్ల గౌరవంగా, అలాగే ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సైన్యానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ చివరి వికెట్ పడిన తర్వాత షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ తారిక్ కొద్దిసేపు ఆగి భారత జట్టువైపు తిరిగి చూసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో భారత ఆటగాళ్లు మైదానం పక్కన విజయోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరూ చేతులు కలపడానికి ఎదురు చూసినట్టే కనిపించిందని సోషల్ మీడియాలో ఓ వర్గం అభిప్రాయపడుతోంది. అయితే వారు ఎందుకు ఆగారో మాత్రం స్పష్టత లేదు.

మ్యాచ్‌కు ముందు రోజు జరిగిన ప్రెస్ మీట్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ గానీ, సల్మాన్ అలీ ఆఘా గానీ చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. “క్రికెట్ స్పిరిట్‌ను గౌరవిస్తాం” అని మాత్రమే సూర్య చెప్పుకొచ్చాడు.

ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ టెర్రర్ అటాక్ ఘటనపై భారత జట్టు భావోద్వేగాలు ఇంకా తగ్గలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, దుబాయ్‌లో జరిగిన టోర్నమెంట్‌కు ముందు కెప్టెన్ల సమావేశంలో సూర్యకుమార్ యాదవ్ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నక్వీతో చేతులు కలపడంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *