ఏపీలోని చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇరువారం చెక్ పోస్ట్ వద్ద కంటైనర్ అదుపు తప్పి.. కారుపై పడింది. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. యాదమరి నుంచి చిత్తూరు కు బైక్ పై వస్తున్న యువకుడు నేషనల్ హైవేని క్రాస్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే.. చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్ డ్రైవర్ రోడ్డుకు అడ్డుగా వచ్చిన బైక్ ను తప్పించబోయే ప్రయత్నం చేశాడు. దీంతో కంటైనర్ కాస్త అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందాడు..
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుదీపక్ బెంగళూరు నుంచి గుడిపాల మండలం 190 రామాపురం సొంత గ్రామానికి కారులో వస్తుండగా.. కంటైనర్ దానిపై పడిపోయింది. దీంతో కారును డ్రైవ్ చేస్తున్న అనుదీపక్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడు.
బెంగళూరులోని విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న అనుదీపక్ గ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారుపై కంటైనర్ పడడంతో కారు నుజ్జునుజ్జయింది. కాగా ప్రమాదానికి గురైన సమయంలో కారులో అనుదీపక్ ఒక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వీడియో చూడండి..
ఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు, చిత్తూరు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య కారులో చిక్కుకుపోయిన అను దీపక్ డెడ్ బాడీని బయటకు తీశారు. క్రేన్, జెసిబి సాయంతో కంటైనర్ ను తొలగించి బయటకు తీశారు.
ఈ ఘటనతో చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడంది.. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..