భార్యాభర్తలు గొడవ పడుతుంటే మధ్యలోకి పోవద్దని పెద్దలు చెబుతుంటారు.. అలాగే రెండు ఎద్దులు పోట్లాడుకుంటుంటే కూడా మధ్యలోకి వెళ్లొద్దని తెలిసోచ్చింది. అయితే ఇక్కడ మధ్యలోకి వెళ్లిన వాళ్లు కావాలని వెళ్లలేదు. కానీ జరగాల్సింది జరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు ఎద్దుల మధ్య జరిగిన పొట్లాట జరుగుతుండగా స్కూటీపై వచ్చిన అమ్మాయి రెండు ఎద్దుల మధ్య చిక్కుకుంది.
ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని సమతా కాలనీలో జరిగింది. ఈ వైరల్ వీడియోలో రెండు ఎద్దులు ఒకదానితో ఒకటి పోరాడుతుండటం కనిపిస్తుంది, దీని కారణంగా చుట్టుపక్కల వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. ఇంతలో ఒక అమ్మాయి తన స్కూటీపై వెళ్తూ.. ఎద్దుల పొట్లాట చూసి స్కూటీ తిప్పడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే లేట్ అయిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి స్కూటీ తిప్పగానే ఒక ఎద్దు మరొక ఎద్దును బలంగా ఢీకొట్టడం, దాని వల్ల అది నేరుగా అమ్మాయి వైపు పడటం మీరు వీడియోలో చూస్తారు. ఎద్దును ఢీకొట్టడంతో, ఆ అమ్మాయి స్కూటీతో పాటు రోడ్డుపై పడిపోతుంది.
కానీ పడిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ధైర్యం కోల్పోలేదు, వెంటనే లేచింది. ఆమె స్కూటీని తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కిందున్న వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి